Telugu Global
Others

తాగునీటి ఎద్దడి లేకుండా చూస్తాం : అయ్యన్నపాత్రుడు

రాష్ట్రంలోని గ్రామాల్లో తాగునీటి ఎద్దడి లేకుండా చేసేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని పంచాయతిరాజ్ శాఖ మంత్రి అయ్యన్నపాత్రుడు స్పష్టం చేశారు. విద్యుత్ సమస్యను అధిగమించేందుకు కేంద్రం సహకారంతో 856 సోలార్‌ పంపుసెట్లను గ్రామాల్లో ఏర్పాటు చేస్తామన్నారు. పంచాయతీల్లో పెండింగ్‌ పనులకు రూ. 2 వేల కోట్లు కేటాయిస్తామని ఆయన తెలిపారు. అంతే కాకుండా స్వచ్ఛభారత్ కింద 659 పంచాయతీల్లో డంపింగ్‌ యార్డులు ఏర్పాటు చేస్తామని అయ్యన్న హామీ ఇచ్చారు. గ్రామాల్లో త్వరలో 12 వేల కి.మీల […]

రాష్ట్రంలోని గ్రామాల్లో తాగునీటి ఎద్దడి లేకుండా చేసేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని పంచాయతిరాజ్ శాఖ మంత్రి అయ్యన్నపాత్రుడు స్పష్టం చేశారు. విద్యుత్ సమస్యను అధిగమించేందుకు కేంద్రం సహకారంతో 856 సోలార్‌ పంపుసెట్లను గ్రామాల్లో ఏర్పాటు చేస్తామన్నారు. పంచాయతీల్లో పెండింగ్‌ పనులకు రూ. 2 వేల కోట్లు కేటాయిస్తామని ఆయన తెలిపారు. అంతే కాకుండా స్వచ్ఛభారత్ కింద 659 పంచాయతీల్లో డంపింగ్‌ యార్డులు ఏర్పాటు చేస్తామని అయ్యన్న హామీ ఇచ్చారు. గ్రామాల్లో త్వరలో 12 వేల కి.మీల సీసీ రోడ్లు పూర్తి చేస్తామని అయ్యన్న చెప్పారు.
First Published:  12 Sept 2015 7:04 PM IST
Next Story