తెలంగాణలో పెట్టుబడులకు పారిశ్రామికవేత్తల ఆసక్తి
భారత్‌లో ఒక పారిశ్రామిక నగరాన్ని నిర్మించాలన్న ఆలోచన తమకు ఉందని, ఇందుకు తెలంగాణ ఎంతవరకు అనుకూలమో పరిశీలిస్తామని చైనాలో అతిపెద్ద కంపెనీ అయిన పార్చ్యూన్ ల్యాండ్ డెవలప్‌మెంట్ కంపెనీ స్పష్టం చేసింది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చైనా రాజధాని బీజింగ్‌లో రాఫెల్స్ బీజింగ్ హోటల్‌లో పలు కంపెనీలు, ఔత్సాహిక పెట్టుబడిదారులతో వరుస భేటీలు నిర్వహించారు. ఈ సమావేశాల్లో పలు చైనా కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి ప్రదర్శించినట్టు తెలుస్తోంది. తెలంగాణలో పెట్టుబడులకు చోంగ్‌క్వింగ్ కంపెనీ అక్కడికక్కడే […]
BY sarvi13 Sept 2015 6:38 AM IST
X
sarvi Updated On: 14 Sept 2015 6:09 AM IST
భారత్‌లో ఒక పారిశ్రామిక నగరాన్ని నిర్మించాలన్న ఆలోచన తమకు ఉందని, ఇందుకు తెలంగాణ ఎంతవరకు అనుకూలమో పరిశీలిస్తామని చైనాలో అతిపెద్ద కంపెనీ అయిన పార్చ్యూన్ ల్యాండ్ డెవలప్‌మెంట్ కంపెనీ స్పష్టం చేసింది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చైనా రాజధాని బీజింగ్‌లో రాఫెల్స్ బీజింగ్ హోటల్‌లో పలు కంపెనీలు, ఔత్సాహిక పెట్టుబడిదారులతో వరుస భేటీలు నిర్వహించారు. ఈ సమావేశాల్లో పలు చైనా కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి ప్రదర్శించినట్టు తెలుస్తోంది. తెలంగాణలో పెట్టుబడులకు చోంగ్‌క్వింగ్ కంపెనీ అక్కడికక్కడే సంసిద్ధత వ్యక్తంచేసింది. కన్‌స్ట్రక్షన్ రంగానికి చెందిన ఈ సంస్థ పీపీపీ పద్ధతిలో మౌలికవసతుల రంగంలో ప్రాజెక్టులు చేపడతామని హామీ ఇచ్చింది. ఎలక్ట్రానిక్స్ అండ్ హార్డ్‌వేర్ విభాగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఇన్‌స్పర్ గ్రూప్ ఆసక్తి కనబరిచింది. ఇన్‌ఫ్రా, ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ సర్వీస్, ల్యాండ్ డెవలప్‌మెంట్, రైల్వే, ఇంజినీరింగ్ హార్డ్‌వేర్ వంటి వివిధ రంగాలకు చెందిన కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులకు ఆసక్తి కనబరిచినట్టు తెలుస్తోంది.
Next Story