ఎంఐఎం వెనక బీజేపీ!
ఊహాగానాలు, అంచనాలు ఎట్టకేలకు నిజమయ్యాయి. బీహార్ బరిలో ఏఐఎంఐఎం పోటీకి రంగం సిద్ధమవుతోంది. ఆ పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ నుంచి శనివారం అధికార ప్రకటన వెలువడటంతో అనుమానాలన్నీ తొలగిపోయాయి. దీంతో బీజేపీ వ్యతిరేక- మహా కూటమి గుండెల్లో గుబులు రేగుతోంది. ముస్లిం, మైనార్టి ఓట్లు చీలిపోతాయన్న ఆందోళనే ఇందుకు కారణం! జనతాపరివార్ నుంచి ఇప్పటికే సమాజ్‌వాదీ బయటికి రావడం, ఎంఐఎం పోటీ ప్రకటనతో వారి భయం రెండింతలైంది. బీహార్‌లో ఎంఐఎం పోటీకి బీజేపీ […]
BY sarvi13 Sept 2015 4:32 AM IST
X
sarvi Updated On: 13 Sept 2015 4:33 AM IST
ఊహాగానాలు, అంచనాలు ఎట్టకేలకు నిజమయ్యాయి. బీహార్ బరిలో ఏఐఎంఐఎం పోటీకి రంగం సిద్ధమవుతోంది. ఆ పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ నుంచి శనివారం అధికార ప్రకటన వెలువడటంతో అనుమానాలన్నీ తొలగిపోయాయి. దీంతో బీజేపీ వ్యతిరేక- మహా కూటమి గుండెల్లో గుబులు రేగుతోంది. ముస్లిం, మైనార్టి ఓట్లు చీలిపోతాయన్న ఆందోళనే ఇందుకు కారణం! జనతాపరివార్ నుంచి ఇప్పటికే సమాజ్‌వాదీ బయటికి రావడం, ఎంఐఎం పోటీ ప్రకటనతో వారి భయం రెండింతలైంది. బీహార్‌లో ఎంఐఎం పోటీకి బీజేపీ మద్దతిస్తోందని కూటమి చేస్తోన్న ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి. బీహార్‌లోని సీమాంచల్ ప్రాంతంలో పోటీకి ఏఐఎంఐఎం ఆసక్తి చూపిస్తోంది. ఈ ప్రాంతంలో 15-20 శాతం ఓట్లు ఏఐఎంఐఎం కొల్లగొట్టే అవకాశం ఉంది. కొత్తపార్టీ ఈ స్థాయిలో ఓట్లు సాధించడమనేది మామూలు విషయం కాదు. ఈ అంశమే బీజేపీ వ్యతిరేక మహాకూటమి గుండెల్లో రైళ్లు పరిగెట్టేలా చేస్తోంది. సీమాంచల్ ప్రాంతంలోని 3 జిల్లాల్లో ముస్లిం జనాభా అధికం. కిషన్‌గంజ్ జిల్లాలో 70 శాతం, అరారియా-పూర్ణియా జిల్లాల్లో 40 శాతం మంది ముస్లిం ఓటర్లు ఉన్నారు. ఇక్కడ 23 అసెంబ్లీ స్థానాలు, 3 ఎంపీ స్థానాలు ఉన్నాయి. అందుకే సీమాంచల్‌లో ఎలాగైనా పాగా వేయాలని ఎంఐఎం విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఇటీవల మహారాష్ట్రలో ఎంఐఎం 3 అసెంబ్లీ సీట్లు సాధించిన ఉత్సాహంతో బీహార్ ఎన్నికల్లో దూసుకుపోవాలని నిర్ణయించింది.
తాము గెలవలేమని తెలిసే..!
ఎంఐఎం పోటీ వెనక బీజేపీ ఉందని బీజేపీ వ్యతిరేక- మహా కూటమి ఆరోపిస్తోంది. ఈ ఎన్నికల్లో గెలవలేమని తెలుసుకున్న బీజేపీ తమకు రావాల్సిన మైనార్టీ ఓట్లను కొల్లగొట్టే కుట్రలో భాగంగానే.. ఎంఐఎంను రంగంలోకి దింపిందని జేడీ(యూ) ధ్వజమెత్తింది. ఎంఐఎం రంగ ప్రవేశంతో బీజేపీ వైఖరి తేటతెల్లమైందని ఆరోపించింది. ఇది బీజేపీ మార్కు కుట్రగా అభివర్ణించింది. ఇలాంటి చర్యలకు తాము బెదరబోమని స్పష్టం చేసింది. 2009లో జేడీయూతో కలిసి పోటీ చేసిన బీజేపీ ఈ ప్రాంతంలో 3 ఎంపీ సీట్లను గెలుచుకుంది. విభేదాల కారణంగా 2014లో ఒంటరిగా పోటీ చేసిన బీజేపీకి దారుణ పరాభవం ఎదురైంది. 3 సీట్లలో ఒక్క సీటు కూడా గెలుచుకోలేదు. తాను గెలవలేని చోట ఎంఐఎంను రంగంలోకి దింపి తమ ఓట్లకు గండికొట్టే చర్యకు బీజేపీ పూనుకుందని జేడీ(యూ) ఆరోపిస్తోంది.
Next Story