Telugu Global
NEWS

విజయవాడ రోడ్డుపై 10 వేల ఓటర్‌ ఐడీ కార్డులు!

విజ‌య‌వాడ‌ పాతబస్తీలో రెండు బస్తాల ఓటర్‌ ఐడీ కార్డులు రోడ్డుపై పడి ఉన్నాయి. దూల్‌పేట వద్ద రోడ్డుపై పడి ఉన్న ఈ రెండు బస్తాల ఓటర్‌ఐడీ కార్డులు జనంలోను, అధికారుల్లోను కలకలం రేపాయి. ఈ రెండు బస్తాల్లో సుమారు 10 వేల ఓటరు కార్డులున్నాయి. ఇవన్నీ సెంట్రల్‌ విజయవాడ నియోజకవర్గానికి చెందినవిగా తెలుస్తోంది. ఓటరు కార్డులు ఇలా రోడ్డుపై పడవేయటంలో ఆంతర్యం ఏమిటన్న దానిపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. దీనికి సంబంధించి అవకతవకలు జరిగాయా? అని […]

విజ‌య‌వాడ‌ పాతబస్తీలో రెండు బస్తాల ఓటర్‌ ఐడీ కార్డులు రోడ్డుపై పడి ఉన్నాయి. దూల్‌పేట వద్ద రోడ్డుపై పడి ఉన్న ఈ రెండు బస్తాల ఓటర్‌ఐడీ కార్డులు జనంలోను, అధికారుల్లోను కలకలం రేపాయి. ఈ రెండు బస్తాల్లో సుమారు 10 వేల ఓటరు కార్డులున్నాయి. ఇవన్నీ సెంట్రల్‌ విజయవాడ నియోజకవర్గానికి చెందినవిగా తెలుస్తోంది. ఓటరు కార్డులు ఇలా రోడ్డుపై పడవేయటంలో ఆంతర్యం ఏమిటన్న దానిపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. దీనికి సంబంధించి అవకతవకలు జరిగాయా? అని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఓటరు కార్డులన్నీ 2008-2011కు సంబంధించినవిగా పోలీసులు గుర్తించారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విషయాన్ని ఎలక్షన్‌ కమిషన్‌ దృష్టికి కూడా తీసుకెళ్లినట్టు తెలిసింది.
First Published:  13 Sept 2015 5:17 PM IST
Next Story