కెమెరాకు చిక్కిన ఇద్దరు అవినీతి జడ్జీలు
దోషులను జైలుకు పంపించాల్సిన వారే… జైలుపాలయ్యారు. న్యాయం చేయాల్సిన వారే తమ తీర్పులను అంగడి సరుకు చేశారు. గుజరాత్‌కు చెందిన ఏడీ ఆచార్య, పీడీ ఇనామ్‌దార్ అనే ఇద్దరు జుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్‌లు(జేఎఫ్‌సీఎం) అడ్డంగా దొరికిపోయారు. హైకోర్టుకు చెందిన విజిలెన్స్ విభాగం సిబ్బంది వీరిని అరెస్టు చేశారు. వాపి పట్టణానికి చెందిన న్యాయవాది జగత్ పటేల్ ఫిర్యాదు మేరకు విజిలెన్స్ విభాగం రంగంలోకి దిగి కోర్టు రూమ్‌లలోని వీరి చాంబర్లలో రహస్యంగా కెమెరాలు అమర్చింది. గత ఏడాది […]
BY sarvi12 Sept 2015 1:33 AM GMT
X
sarvi Updated On: 12 Sept 2015 1:33 AM GMT
దోషులను జైలుకు పంపించాల్సిన వారే… జైలుపాలయ్యారు. న్యాయం చేయాల్సిన వారే తమ తీర్పులను అంగడి సరుకు చేశారు. గుజరాత్‌కు చెందిన ఏడీ ఆచార్య, పీడీ ఇనామ్‌దార్ అనే ఇద్దరు జుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్‌లు(జేఎఫ్‌సీఎం) అడ్డంగా దొరికిపోయారు. హైకోర్టుకు చెందిన విజిలెన్స్ విభాగం సిబ్బంది వీరిని అరెస్టు చేశారు. వాపి పట్టణానికి చెందిన న్యాయవాది జగత్ పటేల్ ఫిర్యాదు మేరకు విజిలెన్స్ విభాగం రంగంలోకి దిగి కోర్టు రూమ్‌లలోని వీరి చాంబర్లలో రహస్యంగా కెమెరాలు అమర్చింది. గత ఏడాది ఫిబ్రవరి నుంచి ఈయేడాది ఏప్రిల్ దాకా వారి వ్యవహారాన్ని పరిశీలించింది. వివిధ కేసులకు సంబంధించి వివిధ పక్షాల లాయర్లతో ఫోన్లలోనూ, నేరుగా మాట్లాడుతూ… కాసుల కోసం బేరసారాలు సాగిస్తున్న వైనం పూర్తిగా రికార్డు అయ్యింది. చివరికి… బుధవారం ఇద్దరు జడ్జిలు ఏడీ ఆచార్య, పీడీ ఇనామ్‌దార్‌లను అరెస్టు చేశారు. వీరిని గతనెలలోనే హైకోర్టు సస్పెండ్ చేసింది.
Next Story