సమస్యల వలయంలో మెట్రో రైల్
మెట్రో మార్గాన్ని మార్చాలని ప్రభుత్వం నిర్ణయించటం, కొన్నిచోట్ల భూసేకరణలో సమస్యలువంటి కారణాల వలన ప్రాజెక్ట్‌లో జాప్యం ఏర్పడుతోందని ఆ కంపెనీ అధినేత వీబీ గాడ్గిల్ చెప్పారు. ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం హైదరాబాద్ మెట్రోను లార్సెన్ అండ్ టూబ్రో(ఎల్ అండ్ టి) సంస్థ 2017 జులై నాలుగోతేదీకి పూర్తి చేయాల్సిఉండగా, అది సాధ్యమయ్యే పనికాదని గాడ్గిల్ తేల్చేశారు. నాగోల్-మెట్టుగూడ మధ్య మొదటి దశ ఈ ఏడాది మార్చి 21కి ప్రారంభిస్తామని ఒకసారి, ఆగస్ట్ 15కు ప్రారంభిస్తామని మరోసారి […]
BY sarvi12 Sept 2015 9:00 AM IST
X
sarvi Updated On: 12 Sept 2015 9:00 AM IST
మెట్రో మార్గాన్ని మార్చాలని ప్రభుత్వం నిర్ణయించటం, కొన్నిచోట్ల భూసేకరణలో సమస్యలువంటి కారణాల వలన ప్రాజెక్ట్‌లో జాప్యం ఏర్పడుతోందని ఆ కంపెనీ అధినేత వీబీ గాడ్గిల్ చెప్పారు. ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం హైదరాబాద్ మెట్రోను లార్సెన్ అండ్ టూబ్రో(ఎల్ అండ్ టి) సంస్థ 2017 జులై నాలుగోతేదీకి పూర్తి చేయాల్సిఉండగా, అది సాధ్యమయ్యే పనికాదని గాడ్గిల్ తేల్చేశారు. నాగోల్-మెట్టుగూడ మధ్య మొదటి దశ ఈ ఏడాది మార్చి 21కి ప్రారంభిస్తామని ఒకసారి, ఆగస్ట్ 15కు ప్రారంభిస్తామని మరోసారి చెప్పినప్పటికీ అది ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు. ప్రాజెక్ట్ ఆలస్యంకావటంతో ఖర్చు పెరిగిపోతుందని ఎల్ అండ్ టి అధికారులుకూడా ఆందోళన చెందుతున్నారు.
ఒక్కరోజు ఆలస్యానికి రూ. 5 కోట్ల భారం
ఒక్కోరోజు ఆలస్యానికి ప్రాజెక్ట్ వ్యయం రు.5 కోట్లు పెరుగుతుందని స్వయంగా అధికారులే చెబుతున్నారు. ప్రాజెక్ట్ ప్రారంభించేటపుడు దీని వ్యయం అంచనా రు.14,370 కోట్లు కాగా ప్రస్తుతం ఇది రు.20,000 కోట్లకు చేరింది. ప్రాజెక్ట్ ఇదే స్థాయిలో సాగితే ఈ వ్యయం రు.25,000 కోట్లకు చేరుతుందని అంచనా. ఎంత పెరిగినా ఈ భారాన్ని చివరకు మోయాల్సింది ప్రజలే కదా! సుల్తాన్ బజార్, అసెంబ్లీ ప్రాంతాలలో మార్గాన్ని మార్చాలని ప్రభుత్వం సూచించింది. ఆ మేరకు ఎల్ అండ్ టి అధికారులు ఈ ఏడాది మే నెలలో నూతన ప్రతిపాదనలు ప్రభుత్వానికి సమర్పించారు. ఈ ప్రతిపాదనలకు ప్రభుత్వం నుంచి ఇంకా అనుమతి లభించలేదు. సుల్తాన్ బజార్, అసెంబ్లీ ప్రాంతాలలో పనులు ఆగిపోయి సంవత్సరం దాటిపోయింది. పాతబస్తీలో పనులు అసలు ప్రారంభమే కాలేదు. ఇక్కడ రీ డిజైనింగ్ వీలుకాదని ఎల్ అండ్ టి సంస్థ ప్రభుత్వానికి తేల్చి చెప్పేసింది. ఈ పరిస్థితుల్లో మెట్రో ఎంతకాలానికి పూర్తవుతుందనే దానిపై అందరికీ సందేహాలే!
Next Story