ఆ నష్టం నేనే భరిస్తా: పవన్ కల్యాణ్
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ నటుడిగానే కాకుండా మానవతావాదిగా పలు సందర్భాల్లో తన ఔదార్యాన్ని చాటుకుంటూనే ఉన్నాడు. తనను పిచ్చిగా అభిమానించే ఫ్యాన్స్‌కు ఏ కష్టం వచ్చినా పవన్ స్పందిస్తాడని కూడా చాలామందికి తెలుసు. తాజాగా అలాంటి ఘటనే మరోసారి భీమవరంలో జరిగింది. సెప్టెంబర్ 2న పవన్ పుట్టినరోజును పురస్కరించుకుని ఫ్యాన్స్ పట్టణంలో పెద్ద ఎత్తున పవన్ కల్యాణ్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే గుర్తు తెలియని వ్యక్తులు వాటిని కాల్చేయడంతో పవన్ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. […]
BY sarvi12 Sept 2015 5:27 AM IST

X
sarvi Updated On: 12 Sept 2015 5:27 AM IST
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ నటుడిగానే కాకుండా మానవతావాదిగా పలు సందర్భాల్లో తన ఔదార్యాన్ని చాటుకుంటూనే ఉన్నాడు. తనను పిచ్చిగా అభిమానించే ఫ్యాన్స్‌కు ఏ కష్టం వచ్చినా పవన్ స్పందిస్తాడని కూడా చాలామందికి తెలుసు. తాజాగా అలాంటి ఘటనే మరోసారి భీమవరంలో జరిగింది. సెప్టెంబర్ 2న పవన్ పుట్టినరోజును పురస్కరించుకుని ఫ్యాన్స్ పట్టణంలో పెద్ద ఎత్తున పవన్ కల్యాణ్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే గుర్తు తెలియని వ్యక్తులు వాటిని కాల్చేయడంతో పవన్ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. పట్టణంలో ఉన్న ప్రైవేట్, ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించారు. మీడియాలో ఈ విషయం రావడంతో గొడవ పవన్ దృష్టికి వెళ్ళింది. దీంతో తన ఫ్యాన్స్ వల్ల కలిగిన నష్టాన్ని తానే భరిస్తానని పవన్ ప్రకటించాడు. మాటలకే పరిమితం కాకుండా తాత్కాలిక పరిహారంగా భీమవరం పోలీస్ సబ్ ఇన్‌స్పెక్టర్‌కు మూడు లక్షల రూపాయలు పంపించాడు పవర్ స్టార్. ఈ విషయాన్ని భీమవరం ఎస్.ఐ. మీడియాకు తెలిపారు. దీంతో పవన్‌కు అభిమానులంటే ఎంత ప్రేమో మరోసారి రుజువైంది.
Next Story