కమల్‌హాసన్ " కేజ్రీవాల్ భేటి!
విశ్వనటుడు కమల్‌హసన్, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను దేశరాజధానిలో కలిశారు. జాతీయస్థాయిలో పేరున్న నటుడు, దేశరాజకీయాల్లో ప్రభంజనం సృష్టించిన సీఎం భేటీ కావడం చర్చానీయాంశమైంది. ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా రెండున్నర గంటల పాటు ఢిల్లీ సెక్రటేరియట్‌లో వీరి మధ్య చర్చలు జరిగాయి. సినిమా షూటింగ్‌లో భాగంగా ఢిల్లీ వచ్చిన కమల్‌హసన్ కేజ్రీవాల్‌ను సినిమాల కోసమే కలిశారంట. ఇంతకీ వారిద్దరు దేని గురించి చర్చించారంటే.. ! ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో పలు చారిత్రక నిర్మాణాలు, పలు అందమైన […]
BY Pragnadhar Reddy12 Sept 2015 5:21 AM IST
X
Pragnadhar Reddy Updated On: 12 Sept 2015 5:21 AM IST
విశ్వనటుడు కమల్‌హసన్, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను దేశరాజధానిలో కలిశారు. జాతీయస్థాయిలో పేరున్న నటుడు, దేశరాజకీయాల్లో ప్రభంజనం సృష్టించిన సీఎం భేటీ కావడం చర్చానీయాంశమైంది. ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా రెండున్నర గంటల పాటు ఢిల్లీ సెక్రటేరియట్‌లో వీరి మధ్య చర్చలు జరిగాయి. సినిమా షూటింగ్‌లో భాగంగా ఢిల్లీ వచ్చిన కమల్‌హసన్ కేజ్రీవాల్‌ను సినిమాల కోసమే కలిశారంట.
ఇంతకీ వారిద్దరు దేని గురించి చర్చించారంటే.. !
ఇంతకీ వారిద్దరు దేని గురించి చర్చించారంటే.. !
ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో పలు చారిత్రక నిర్మాణాలు, పలు అందమైన లొకేషన్లు ఉన్నాయి. వీటి వద్ద సినిమా షూటింగులు జరపాలంటే. అనుమతి తప్పనిసరి. ఈ అనుమతులు తీసుకోవడం చాలా క్లిష్టంగా ఉందని కమల్ భావించారు. అందుకే వీటిని మరింత సులభతరం చేస్తే.. సినిమా ఇండస్ర్టీకి దోహదం చేసిన వారవుతారని కేజ్రీని విజ్ఞప్తి చేశారు. ఇందుకు కేజ్రీ కూడా సుముఖత వ్యక్తం చేశారు. ఢిల్లీలో సినీపరిశ్రమ బలోపేతానికి తమ ప్రభుత్వం తరఫున తప్పకుండా చర్యలు తీసుకుంటామన్నారు. దేశరాజధానిలో ఫిల్మ్‌సిటీని నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. అలాగే సినీ పరిశ్రమలో పనిచేసే కార్మికుల నైపుణ్యాభివృద్ధికి చర్యలు చేపట్టాలని 60 ఏళ్ల లోకనాయకుడు కేజ్రీని కోరారు.
Next Story