Telugu Global
Family

జర నవ్వండి ప్లీజ్ 203

స్పెషల్‌ “నువ్వీ రోజు మా ఇంటికి భోజనానికి రావాలోయ్‌..!” “ఏంటి స్పెషల్‌?” “మా ఆవిడకి పొట్లకాయ, కోడిగ్రుడ్డు కలిపి వండిన కూర తింటే ఏమవుతుందో ఒకసారి చూడాలని ఉందట.” ————————————————————————————– ఆధునికం అత్తగారింటికి మొదటిసారిగా వెళుతున్న కూతురికి జాగ్రత్తలు చెబుతోంది తల్లి – “చూడమ్మా! ముందు భోజనం మీ ఆయనకు వడ్డించి అతను తిన్న తరువాతే నువ్వు తిను.” “ఓ హో! అందులో ఏమైనా విషం అదీ కలిపితే మనకి తెలిసిపోతుంది. అంతే కదా మమ్మీ” అందా […]

స్పెషల్‌
“నువ్వీ రోజు మా ఇంటికి భోజనానికి రావాలోయ్‌..!”
“ఏంటి స్పెషల్‌?”
“మా ఆవిడకి పొట్లకాయ, కోడిగ్రుడ్డు కలిపి వండిన కూర తింటే ఏమవుతుందో ఒకసారి చూడాలని ఉందట.”
————————————————————————————–
ఆధునికం
అత్తగారింటికి మొదటిసారిగా వెళుతున్న కూతురికి జాగ్రత్తలు చెబుతోంది తల్లి – “చూడమ్మా! ముందు భోజనం మీ ఆయనకు వడ్డించి అతను తిన్న తరువాతే నువ్వు తిను.”
“ఓ హో! అందులో ఏమైనా విషం అదీ కలిపితే మనకి తెలిసిపోతుంది. అంతే కదా మమ్మీ” అందా ఆధునికి యువతి.
————————————————————————————–
ఒకే ప్రశ్న
రైల్వే స్టేషన్‌లలో, బస్‌ స్టాండ్‌లలో ఇద్దరు బిచ్చగాళ్లు కలిసినా, ఇద్దరు సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు కలిసినా అడిగేది ఒకే ప్రశ్న. ఏంటది?
“నీది ఏ ప్లాట్‌ఫాం?”
————————————————————————————–
సౌండ్‌ ఎఫెక్ట్‌
“సంగీతం కోసం మా అమ్మాయి ఏమైనా చేస్తుంది!” అన్నాడతను తన కూతురి ప్రతిభను పక్కింటి వ్యక్తితో చెబుతూ.
పక్కింటతను “రోజూ ఆమె సాధన వినలేక ఈ ఊరు వదిలి వెళుతున్నా!” అన్నాడు.
“మా అమ్మాయి సంగీత సాధన నాకెంతో ఉపకరించింది”
“ఎట్లా?”
“పక్కింటి వాళ్ల ఇల్లు సగం ధరకే కొన్నాను.”

First Published:  11 Sept 2015 6:33 PM IST
Next Story