పోలీసు అధికారిపై దాడి... బంగారు ఆభరణాల చోరీ!
హైదరాబాద్‌లోని తెలంగాణ పోలీసు అకాడమీలో డిప్యూటీ డైరెక్టర్‌గా పని చేస్తున్న ఎస్.ఎం. రత్నపై దొంగలు దాడి చేసి ఆమె మెడలో గొలుసుతోపాటు బంగారు నగలను, రెండు వేల రూపాయల నగదును లాక్కుపోయారు. ఆమె ప్రతిఘటించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. నిజానికి ఆమె సికింద్రాబాద్ నుంచి చెన్నయ్‌కు సింహపురి ఎక్ప్‌ప్రెస్‌లో వెళ్ళాల్సి ఉంది. ఆమెకు రైలు మిస్ అవ్వడంతో నెల్లూరు నుంచి గూడూరుకు వెళుతున్న రైలు ఎక్కారు. గూడూరు స్టేషన్‌కు చేరిన సమయంలో ప్రయాణికులందరూ దిగిపోగా ఆమె దిగే ప్రయత్నంలో […]
BY sarvi12 Sept 2015 1:46 AM GMT
X
sarvi Updated On: 12 Sept 2015 2:16 AM GMT
హైదరాబాద్‌లోని తెలంగాణ పోలీసు అకాడమీలో డిప్యూటీ డైరెక్టర్‌గా పని చేస్తున్న ఎస్.ఎం. రత్నపై దొంగలు దాడి చేసి ఆమె మెడలో గొలుసుతోపాటు బంగారు నగలను, రెండు వేల రూపాయల నగదును లాక్కుపోయారు. ఆమె ప్రతిఘటించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. నిజానికి ఆమె సికింద్రాబాద్ నుంచి చెన్నయ్‌కు సింహపురి ఎక్ప్‌ప్రెస్‌లో వెళ్ళాల్సి ఉంది. ఆమెకు రైలు మిస్ అవ్వడంతో నెల్లూరు నుంచి గూడూరుకు వెళుతున్న రైలు ఎక్కారు. గూడూరు స్టేషన్‌కు చేరిన సమయంలో ప్రయాణికులందరూ దిగిపోగా ఆమె దిగే ప్రయత్నంలో ఉన్నారు. ఈ సమయంలోనే గుర్తు తెలియని దుండుగులు దాడి చేసి ఆమె మెడలోని బంగారు గొలుసును, నగదును అపహరించుకు వెళ్లారు. ఈ సంఘటనలో తీవ్రంగా గాయపడిన ఎస్పీ రత్నను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. రైల్వే పోలీసులకు ఆమె ఫిర్యాదు చేశారు. రత్న సివిల్ డ్రెస్‌లో ఉండడం వల్ల పోలీసు అధికారిగా దొంగలు గుర్తించకపోవడంతో ఈ దాడికి, దోపిడీకి పాల్పడి ఉంటారని భావిస్తున్నారు. రైల్వే పోలీసులు హైదరాబాద్‌లోని ఆమె పని చేస్తున్న పోలీసు అకాడమీకి కూడా సమాచారం అందించారు. గొలుసు దొంగల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Next Story