Telugu Global
National

రోగులతో అనుబంధంతోనే చికిత్సకు పరిపూర్ణత

వైద్యుల స్నాతకోత్సవంలో ప్రధాని మోడి వ్యాఖ్య వైద్యులు రోగం మీద కాకుండా రోగుల మీద శ్రద్ధ పెట్టినప్పుడే పూర్తి విజయం సాధించగలరని ప్రధానమంత్రి నరేంద్రమోడి అన్నారు. చండీగఢ్‌లోని పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చ్‌ స్నాతకోత్సవానికి హాజరైన ఆయన మాట్లాడుతూ ప్రజలు వైద్యుల్ని దేవుడిగా భావిస్తారని, దేవుడు భక్తుల్ని కరుణించి కాపాడినట్టే వైద్యులు కూడా వారిని కాపాడాలని ఆయన హితవు చెప్పారు. తెలివితేటలుంటే సరిపోదని, రోగులతో అనుబంధం ఏర్పరుచుకుని వారికి స్వాంతన చేకూర్చాలని […]

రోగులతో అనుబంధంతోనే చికిత్సకు పరిపూర్ణత
X
వైద్యుల స్నాతకోత్సవంలో ప్రధాని మోడి వ్యాఖ్య
వైద్యులు రోగం మీద కాకుండా రోగుల మీద శ్రద్ధ పెట్టినప్పుడే పూర్తి విజయం సాధించగలరని ప్రధానమంత్రి నరేంద్రమోడి అన్నారు. చండీగఢ్‌లోని పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చ్‌ స్నాతకోత్సవానికి హాజరైన ఆయన మాట్లాడుతూ ప్రజలు వైద్యుల్ని దేవుడిగా భావిస్తారని, దేవుడు భక్తుల్ని కరుణించి కాపాడినట్టే వైద్యులు కూడా వారిని కాపాడాలని ఆయన హితవు చెప్పారు. తెలివితేటలుంటే సరిపోదని, రోగులతో అనుబంధం ఏర్పరుచుకుని వారికి స్వాంతన చేకూర్చాలని పిలుపు ఇచ్చారు. వైద్యంలో టెక్నాలజీ పాత్రను పెంచాలని, పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని మంచి వైద్యం అందించాలని కోరారు. మందులకు దూరంగా ఉండాలని, ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలని పేదలు భావిస్తున్నారని, ఇందుకు వైద్యులు కూడా సహకరించి తమ వంతు పాత్ర పోషించాలని ప్రధాని హితవు చెప్పారు. ఆరోగ్యం కాపాడడంలో యోగా ఎంతో ప్రముఖ పాత్ర పోషిస్తుందని, ఈ విషయాన్ని ప్రపంచదేశాలు గుర్తించాయి కాబట్టే జూన్‌ 21వ తేదీని 177 దేశాలు యోగా దినోత్సవంగా జరుపుకుంటున్నాయని ఆయన గుర్తు చేశారు. ప్రత్యమ్నాయ వైద్య విధానాలను విమర్శించుకోవడం సరికాదని, అందరి లక్ష్యం దేశ ప్రజలను ఆరోగ్యంగా ఉంచడమే కాబట్టి ఒకరికొకరు పరిజ్ఞానాన్ని ఇచ్చిపుచ్చుకోవాలని ఆయన కోరారు. చంపడం చాలా సులభమని, ప్రాణం పోయడమే ఎంతో కష్టమైన విషయమని… తల్లి తర్వాత ప్రాణం పోయగల శక్తి ఒక్క వైద్యులకు మాత్రమే ఉందని చెప్పారు. వృత్తి నైపుణ్యాలలో అనుబంధాలకు ప్రాధాన్యత ఇవ్వాలన్న సంకల్పం భాగంగా కావాలని ప్రధాని పిలుపు ఇచ్చారు.
First Published:  11 Sept 2015 9:20 AM IST
Next Story