తెలంగాణలో మద్యం పాలసీ ఖరారు
తెలంగాణలో నూతన మద్యం పాలసీ ఖరారైంది. మద్యం విధానానికి సవరణలు చేసి నూతన మద్యం విధానంపై ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో మద్యం దుకాణాలకు రెండేళ్ల కాల పరిమితితో లైసెన్సులు మంజూరు చేయనున్నారు. అక్టోబర్ 1 నుంచి 2017 సెప్టెంబర్ 30 వరకు లైసెన్సులు అమలులో ఉంటాయి. అలాగే లైసెన్స్ ఫీజును ప్రభుత్వం 20 శాతం పెంచింది. 10వేల జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ.39 లక్షలుగా, 10-50 వేల జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ.40.80 లక్షలుగా నిర్ణయించింది. […]
BY Pragnadhar Reddy11 Sept 2015 4:26 PM IST
X
Pragnadhar Reddy Updated On: 11 Sept 2015 4:28 PM IST
తెలంగాణలో నూతన మద్యం పాలసీ ఖరారైంది. మద్యం విధానానికి సవరణలు చేసి నూతన మద్యం విధానంపై ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో మద్యం దుకాణాలకు రెండేళ్ల కాల పరిమితితో లైసెన్సులు మంజూరు చేయనున్నారు. అక్టోబర్ 1 నుంచి 2017 సెప్టెంబర్ 30 వరకు లైసెన్సులు అమలులో ఉంటాయి. అలాగే లైసెన్స్ ఫీజును ప్రభుత్వం 20 శాతం పెంచింది. 10వేల జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ.39 లక్షలుగా, 10-50 వేల జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ.40.80 లక్షలుగా నిర్ణయించింది. అలాగే 3 నుంచి 5 లక్షల జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ.60లక్షలు, 5 నుంచి 20 లక్షల జనాభా ఉన్న ప్రాంతాల్లో 81.60 లక్షలుగా ఫీజును నిర్ణయించింది. ఇక 20లక్షలకు పైగా జనాభా ఉన్న చోట్ల 1.08 కోట్లుగా లైసెన్సు ఫీజు నిర్ణయించింది. మద్యం దుకాణాలకు రెండేళ్ల కాలపరిమితితో లైసెన్స్‌లు ఇవ్వాలని నిర్ణయించింది. 2015 అక్టోబర్ 1 నుంచి 2017 సెప్టెంబర్ 30 వరకు లైసెన్స్‌లు అమలులో ఉంటాయి. లాటరీ పద్ధతిలో షాపులను ఎంపిక చేస్తారు. లైసెన్స్ ఫీజు విలువకు 7 రెట్లు మించిన విక్రయాలకు 8 శాతం ప్రివిలైజ్ ఫీజు నిర్ణయించింది. 8 శాతం ప్రివిలైజ్ పీజును ప్రభుత్వానికి చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
Next Story