కాశ్మీర్ వేర్పాటువాదుల వార్నింగ్
గోమాంస విక్రయాలపై ఉన్న నిషేధాన్ని కఠినంగా అమలు చేయాలన్న జమ్ముకాశ్మీర్ హైకోర్టు ఆదేశాలను వేర్పాటువాదులు బేఖాతరు చేశారు. తమపై ఏ ఆదేశాలూ పని చేయవంటూ బక్రీద్ రోజు గోవులను బలిస్తామని హెచ్చరించారు. అది కూడా శ్రీనగర్‌లోని లాల్‌చౌక్ వద్ద గోవులను బలిస్తామని, చేతనైతే ఆపమని సవాలు విసిరారు. ఇస్లామిక్ లా తప్ప తాము ఏ న్యాయస్థానం, ఏ ప్రభుత్వ ఆదేశాలు పాటించబోమన్నారు. కోర్టు ఆదేశాలకు వ్యతిరేకంగా లోయలో ఆందోళనలు నిర్వహించాలని హురియత్ కాన్ఫరెన్స్ నేత సయ్యద్ అలీ […]
BY Pragnadhar Reddy10 Sept 2015 1:06 PM GMT
Pragnadhar Reddy Updated On: 10 Sept 2015 9:29 PM GMT
గోమాంస విక్రయాలపై ఉన్న నిషేధాన్ని కఠినంగా అమలు చేయాలన్న జమ్ముకాశ్మీర్ హైకోర్టు ఆదేశాలను వేర్పాటువాదులు బేఖాతరు చేశారు. తమపై ఏ ఆదేశాలూ పని చేయవంటూ బక్రీద్ రోజు గోవులను బలిస్తామని హెచ్చరించారు. అది కూడా శ్రీనగర్‌లోని లాల్‌చౌక్ వద్ద గోవులను బలిస్తామని, చేతనైతే ఆపమని సవాలు విసిరారు. ఇస్లామిక్ లా తప్ప తాము ఏ న్యాయస్థానం, ఏ ప్రభుత్వ ఆదేశాలు పాటించబోమన్నారు. కోర్టు ఆదేశాలకు వ్యతిరేకంగా లోయలో ఆందోళనలు నిర్వహించాలని హురియత్ కాన్ఫరెన్స్ నేత సయ్యద్ అలీ గిలానీ పిలుపునిచ్చారు. కాశ్మీర్ వేర్పాటువాదుల ఆగడాలను ప్రభుత్వం ఎలా కట్టడి చేస్తున్నదన్న దానిపైనే ఇపుడు అందరూ దృష్టి పెట్టారు.
Next Story