Telugu Global
Others

నిండు కుండలా జూరాల జలాశయం

జూరాల జలాశయం నిండు కుండను తలపిస్తున్నది. ఎగువన కురుస్తున్న వర్షాలతో ఇన్‌ ఫ్లో గణనీయంగా పెరిగింది. ఇన్‌ఫ్లో బుధవారం 10,448 క్యూసెక్కులుండగా గురువారం సాయంత్రం 35 వేల క్యూసెక్కులకు చేరుకున్నది. జూరాల పూర్తి సామర్థ్యం 11.941 టీఎంసీలు కాగా గురువారం 11.789 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది. ఇన్‌ఫ్లో ఇదే స్థాయిలో ఉంటే ఏ క్షణంలోనైనా ప్రాజెక్టు గేట్లను ఎత్తే అవకాశం ఉంది. వానాకాలమంతా నీరు లేక విలవిలలాడిపోయిన ప్రాజెక్టులో శీతాకాలం ప్రవేశించే సమయంలో కురుస్తున్న వర్షాలు […]

నిండు కుండలా జూరాల జలాశయం
X
జూరాల జలాశయం నిండు కుండను తలపిస్తున్నది. ఎగువన కురుస్తున్న వర్షాలతో ఇన్‌ ఫ్లో గణనీయంగా పెరిగింది. ఇన్‌ఫ్లో బుధవారం 10,448 క్యూసెక్కులుండగా గురువారం సాయంత్రం 35 వేల క్యూసెక్కులకు చేరుకున్నది. జూరాల పూర్తి సామర్థ్యం 11.941 టీఎంసీలు కాగా గురువారం 11.789 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది. ఇన్‌ఫ్లో ఇదే స్థాయిలో ఉంటే ఏ క్షణంలోనైనా ప్రాజెక్టు గేట్లను ఎత్తే అవకాశం ఉంది. వానాకాలమంతా నీరు లేక విలవిలలాడిపోయిన ప్రాజెక్టులో శీతాకాలం ప్రవేశించే సమయంలో కురుస్తున్న వర్షాలు కొత్త కళను సంతరింపజేశాయి. జూరాల కింద ఉన్న చెరువులకు, తాగునీటి పథకాలను నింపేందుకు గురువారం మధ్యాహ్నం నుంచి కుడి, ఎడమ కాల్వలకు వెయ్యి క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్టు ప్రాజెక్టు ఏఈఈ వీరశేఖర్ తెలిపారు. మూడు యూనిట్లలో 117 మెగావాట్ల విద్యుత్‌ను సైతం ఉత్పత్తి చేస్తున్నారు. నెట్టెంపాడు, భీమా ఎత్తిపోతల పథకాలకు కూడా నీటిని విడుదల చేయనున్నట్లు పాలమూరు ప్రాజెక్టుల చీఫ్ ఇంజినీర్ ఖగేందర్ తెలిపారు. కృష్ణానది యాజమాన్య బోర్డు ఆదేశాల మేరకు తాగుకు తప్ప సాగుకు నీరిచ్చే అవకాశాలు లేవన్నారు. ఆల్మట్టిలోకి 2,702 క్యూసెక్కుల నీరు మాత్రమే చేరుతుండగా 7,400 క్యూసెక్కుల నీటిని పవర్‌హౌస్‌కు విడుదల చేస్తున్నారు. పూర్తి సామర్థ్యం 127 టీఎంసీలు కాగా గురువారం 58.40 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది.
First Published:  11 Sept 2015 4:09 PM IST
Next Story