జర నవ్వండి ప్లీజ్ 202
దొంగలు ‘ఇంట్లో దొంగలు పడితే ఒకళ్లో, ఇద్దరో పడతారు గానీ మీరేంటయ్యా ఏకంగా వందమంది వచ్చి పడ్డారు’ ఆశ్చర్యంగా అడిగాడు మెలకువ వచ్చిన ఇంటి యజమాని. ‘వీళ్లంతా మా దొంగల స్కూల్లో చదువుకుంటున్నారు. ప్రాక్టికల్స్ కోసం మీ ఇంటికి తీసుకొచ్చాను’ చెప్పాడు మాస్టర్ దొంగ. —————————————————————————— ప్రేమ ‘ఎప్పుడూ లేనిది ఇవాళేంటోయ్ ఇంత ప్రేమ?” భార్య ఇచ్చిన లోటాడు కాఫీని అందుకుంటూ సంబరంగా అడిగాడు సత్యారావ్. ‘ఇవాళ పనిమనిషి రాలేదు. ఈ కాఫీ తాగి పని మొదలెడతారని” […]
దొంగలు
‘ఇంట్లో దొంగలు పడితే ఒకళ్లో, ఇద్దరో పడతారు గానీ మీరేంటయ్యా ఏకంగా వందమంది వచ్చి పడ్డారు’ ఆశ్చర్యంగా అడిగాడు మెలకువ వచ్చిన ఇంటి యజమాని.
‘వీళ్లంతా మా దొంగల స్కూల్లో చదువుకుంటున్నారు. ప్రాక్టికల్స్ కోసం మీ ఇంటికి తీసుకొచ్చాను’ చెప్పాడు మాస్టర్ దొంగ.
——————————————————————————
ప్రేమ
‘ఎప్పుడూ లేనిది ఇవాళేంటోయ్ ఇంత ప్రేమ?” భార్య ఇచ్చిన లోటాడు కాఫీని అందుకుంటూ సంబరంగా అడిగాడు సత్యారావ్.
‘ఇవాళ పనిమనిషి రాలేదు. ఈ కాఫీ తాగి పని మొదలెడతారని” ప్రేమగా చెప్పింది భార్యామణి.
——————————————————————————
నాన్ వెజ్
‘ఇవాళ మీకు కొత్త టీచర్ వచ్చేరు కదరా. ఆవిడ వెజిటేరియానా లేక నాన్‌వెజిటేరియనా?” అడిగాడు సోము.
“కచ్చితంగా నాన్‌వెజిటేరియనేరా, మొదటి రోజే మా మెదళ్లన్నీ తినేసింది” నిట్టూరుస్తూ చెప్పాడు రాము.