పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి తీరతాం: హరీష్
రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చైనా సరే ప్రభుత్వం పూర్తి చేస్తుందని ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్‌రావు స్పష్టం చేశారు. ఆదిలాబాద్ జిల్లా కెరామెరి మండలం అమ్మనగూడ ప్రాజెక్టును ఆయన సందర్శించారు. ఆయనతోపాటు మంత్రులు జోగు రామన్న, ఇంద్రకరణ్‌రెడ్డిలు కూడా ఈ ప్రాజెక్టును పరిశీలించారు. గత ప్రభుత్వాల నిర్వాకం వల్లే రాష్ట్రంలో ప్రాజెక్టులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. అయితే తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందని, రైతులకు మేలు చేయడమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నామని […]
BY sarvi10 Sept 2015 6:51 PM IST
X
sarvi Updated On: 11 Sept 2015 11:20 AM IST
రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చైనా సరే ప్రభుత్వం పూర్తి చేస్తుందని ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్‌రావు స్పష్టం చేశారు. ఆదిలాబాద్ జిల్లా కెరామెరి మండలం అమ్మనగూడ ప్రాజెక్టును ఆయన సందర్శించారు. ఆయనతోపాటు మంత్రులు జోగు రామన్న, ఇంద్రకరణ్‌రెడ్డిలు కూడా ఈ ప్రాజెక్టును పరిశీలించారు. గత ప్రభుత్వాల నిర్వాకం వల్లే రాష్ట్రంలో ప్రాజెక్టులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. అయితే తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందని, రైతులకు మేలు చేయడమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నామని చెప్పారు. అమ్మనగూడ ప్రాజెక్టును రూ.7.67 కోట్లతో పూర్తి చేస్తామని అక్కడున్న రైతులకు హామీ ఇచ్చారు.
Next Story