బాబు స్టైల్ చీరాల పంచాయితీ
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పార్టీలో అంతర్గత వ్యవహారాలు చక్కదిద్దే స్టైలే వేరు. పొమ్మనకుండా పొగబెట్టడంలోనూ బాబు నిష్ణాతుడని దెబ్బ తిన్న వారు చెప్పే మాట. అలాగే నియోజకవర్గ స్థాయి నేతలకు ముకుతాడు వేయాలంటే..నేరుగా వారిపై చర్యలు తీసుకోకుండా..వారిని ఢీకొట్టగలవారిని అదే నియోజకవర్గంలో మొహరించడం బాబుకు రాజకీయంతో పెట్టిన విద్యనేది టీడీపీ మాజీ నేతలు విశ్లేషణ. ఒకరికి చెక్‌పెట్టేందుకు ఇంకొకరిని రంగంలోకి దింపి..ఇద్దరిని ఒకరిపై మరొకరిని ఉసిగొల్పి వేడుక చూడడం..చివరికి తన లక్ష్యమైన నేత పార్టీ నుంచి […]
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పార్టీలో అంతర్గత వ్యవహారాలు చక్కదిద్దే స్టైలే వేరు. పొమ్మనకుండా పొగబెట్టడంలోనూ బాబు నిష్ణాతుడని దెబ్బ తిన్న వారు చెప్పే మాట. అలాగే నియోజకవర్గ స్థాయి నేతలకు ముకుతాడు వేయాలంటే..నేరుగా వారిపై చర్యలు తీసుకోకుండా..వారిని ఢీకొట్టగలవారిని అదే నియోజకవర్గంలో మొహరించడం బాబుకు రాజకీయంతో పెట్టిన విద్యనేది టీడీపీ మాజీ నేతలు విశ్లేషణ. ఒకరికి చెక్‌పెట్టేందుకు ఇంకొకరిని రంగంలోకి దింపి..ఇద్దరిని ఒకరిపై మరొకరిని ఉసిగొల్పి వేడుక చూడడం..చివరికి తన లక్ష్యమైన నేత పార్టీ నుంచి వెళ్లిపోయాలా చేయడం చంద్రబాబు ఆపరేషన్ స్టైల్. ఇదే శైలి పంచాయితీని చీరాలలో షురూ చేశారు చంద్రబాబు. అనంతపురం జిల్లాకు చెందిన పరిటాల అనుచరుడు పోతుల సురేష్‌ను సతీసమేతంగా ఎన్నికలకు ముందు చీరాల టీడీపీ నేతలుగా చంద్రబాబు పరిచయం చేశారు. ఆ ఎన్నికల్లో పోతుల సురేష్ సతీమణి సునీత ఓడిపోయారు. ఇండిపెండెంట్‌గా గెలిచిన ఆమంచి కృష్ణమోహన్ షరామామూలుగా అధికార పార్టీలో చేరేందుకు మొగ్గు చూపాడు. అదే సమయంలో ప్రకాశం జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచే అవకాశం లేక ..కొన్ని ఒప్పందాలతో ఆమంచిని తెలుగుదేశం పార్టీ అనుబంధ సభ్యునిగా కొనసాగించేందుకు పసుపు కండువా కప్పేశారు. అయితే టీడీపీలో చేరిన ఎమ్మెల్యే ఆమంచిచీరాల నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి పోతుల సునీతలు రోజూ వేదికపై సీటు కోసం కొట్లాడుకుంటున్నారు. నియోజకవర్గంలో పట్టు కోసం ఆధిపత్య పోరు కొనసాగిస్తున్నారు. అయినా బాబు పట్టించుకోరు. పిలిచి మందలించరు. ఆమంచి వెర్సస్ పోతుల కొట్లాటలతో చీరాలలో టీడీపీ పరువు రోజూ రోడ్డున పడుతోందని కిందిస్థాయి కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయినా అధినేత వేడుక చూస్తున్నారని కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.
ఇద్దరూ ఇద్దరే!
ఆమంచి కృష్ణమోహన్ ..బ్యాచ్ నెంబర్ 2004, ట్రైన్ డ్ ఇన్ పవర్ పాలిటిక్స్. చీరాల నియోజకవర్గంలో ఆమంచిని ఎదిరించి నిలిచే నాయకుడే లేకుండా పోయాడు. అదే సమయంలో తన గురువు అయిన రోశయ్య సీఎం అయ్యారు. ఈ కాలంలో ఆమంచి కృష్ణమోహన్ చీరాల నియోజకవర్గాన్ని తన కనుసన్నలతో శాసించాడు. రాష్ర్ట రాజకీయాలలోనూ కీలకంగా వ్యవహరించాడు. రోశయ్య దిగిపోయిన తరువాత కూడా ఇసుకదందాలు, కేబుల్ బిజినెస్‌లతో పాటు సెటిల్మెంట్లకు కూడా చేశారనే ఆరోపణలున్నాయి. ఆమంచికి అదే స్థాయిలో పోటీ ఇచ్చేది ఎవరా అని వెతికి మరీ పోతుల సురేశ్‌ను చీరాల పంపారు చంద్రబాబు. పరిటాల రవి అనుచరుడిగా, రవి ఫ్యాక్షన్ కార్యకలాపాలకు తోడూ నీడగా ఉండేవాడని పోతుల సురేష్‌పై ఆరోపణలున్నాయి. అదే సురేష్ భార్యాసమేతంగా కేవలం రాజకీయ మనుగడ కోసం, బాబు సూచన మేరకు చీరాల చేరారు. నాన్‌లోకల్ గా వచ్చి లోకల్ గా మారేందుకు, ఆమంచిని ఎదుర్కొనేందుకు పోతుల దంపతులు పోరాడుతూనే ఉన్నారు. ఆమంచి వెర్సస్ పోతుల పోరులో ఎవరో ఒకరు ఓడిపోయి, చీరాల వదిలివెళ్లేవరకూ బాబు..తనకేమీ పట్టనట్టే వ్యవహరిస్తారని ఆయన రాజకీయం స్టైల్ తెలిసిన నాయకులు చెబుతున్న మాట. బాబు స్టైల్ చీరాల పంచాయితీ చివరకు తెగేది ఇలాగన్న మాట.