Telugu Global
Cinema & Entertainment

మీడియా పబ్లిసిటి కోసం కూసింత కళాపోషణ‌

మ‌నిషి అన్నాక కూసింత  క‌ళాపోష‌ణ ఉండాలని  బాపు గారు .. ముత్యాల ముగ్గు చిత్రంలో రావు గోపాల రావు తో చెప్పించిన డైలాగ్  ను  కొంచెం ఇటు అటు చేసి..  ఈ మ‌ధ్య కొంద‌రు  ప్ర‌చారానికి వాడేసుకుంటున్నారు. మోడ‌ల్స్ అన్నాక‌..  మాట‌లు, స్టేట్ మెంట్స్ తో ప్ర‌చారం గెయిన్ చే్యాలనే చందంగా  స్టేట్ మెంట్స్ ఇస్తున్నారు.ఈ  విష‌యంలో  మ‌న‌కు ముందు గుర్తుకు వ‌చ్చేది  పూన‌మ్ పాండే.   గ‌త వ‌ర‌ల్డ్ క‌ప్ సమ‌యంలో   కప్ గెలిస్తే.. […]

మీడియా పబ్లిసిటి కోసం కూసింత కళాపోషణ‌
X
మ‌నిషి అన్నాక కూసింత క‌ళాపోష‌ణ ఉండాలని బాపు గారు .. ముత్యాల ముగ్గు చిత్రంలో రావు గోపాల రావు తో చెప్పించిన డైలాగ్ ను కొంచెం ఇటు అటు చేసి.. ఈ మ‌ధ్య కొంద‌రు ప్ర‌చారానికి వాడేసుకుంటున్నారు. మోడ‌ల్స్ అన్నాక‌.. మాట‌లు, స్టేట్ మెంట్స్ తో ప్ర‌చారం గెయిన్ చే్యాలనే చందంగా స్టేట్ మెంట్స్ ఇస్తున్నారు.ఈ విష‌యంలో మ‌న‌కు ముందు గుర్తుకు వ‌చ్చేది పూన‌మ్ పాండే. గ‌త వ‌ర‌ల్డ్ క‌ప్ సమ‌యంలో కప్ గెలిస్తే.. టీమ్ ఇండియా ప్లేయిర్స్ ముందు.. న‌గ్నంగా డాన్స్ చేస్తాన‌ని స్టేట్ మెంట్ ఇచ్చి ప్ర‌చారం గెయిన్ చేసింది. అటువంటి వివాద స్ప‌ద వ్యాఖ్య‌లు చేయ‌డంలో పూన‌మ్ పాండే కు జత గా మ‌రో మోడ‌ల్ త‌యారైంది. ఆమే మ‌రేవ‌రో కాదండోయ్ ..అర్షిఖాన్.
పాక్ క్రికెటర్ షాహిద్ అఫ్రిదితో శృంగారంలో పాల్గొన్నానని ప్రముఖ మోడల్, నటి అర్షి ఖాన్ సంచలనాత్మక ప్రకటన చేసింది. అతనిపై ప్రేమతోనే అలా చేశా…అంటూ రహస్యాన్ని బట్టబయలు చేస్తూ కుండ బద్దలుగొట్టింది. అవును, అఫ్రిదితో ‘ఆపని’ చేశా! ఒకరితో పడుకోడానికి భారత మీడియా అనుమతి తీసుకోవాలా? ఇది నా వ్యక్తిగత జీవితం. నా ఇష్టం అంటూ ట్వీట్ చేసింది. ఆఫ్రిదిని పెళ్లి చేసుకోవడానికి కూడా త‌ను రెడి అంటూ ట్విట్స్ చేసింది. పాకిస్తానీ వార్త ప‌త్రిక‌లన్నింటిలో తమ మ‌ధ్య ఏదో ఉంద‌ని రాసేస్తున్నాయ‌ని.. అంద‌కు త‌న‌కు చాల ఆనందంగా ఉందంటూ సోష‌ల్ నెట్ వ‌ర్క్ లో ట్విట్స్ పేల్చేసింది గతంలో అఫ్రిదితో ఎఫైర్ ఉందని వచ్చిన వార్తలను ఖండిస్తూ తామిద్దరం మంచి స్నేహితులం మాత్రమే అని చెప్పింది ఈ అమ్మడు. ఆసక్తికరమైన విషయమేమిటంటే దుబాయ్‌లో వీరిద్దరు అత్యంత సన్నిహితంగా గడిపినట్లు అప్పట్లో మీడియా కోడై కూసింది. మ‌రి హాట్ బ్యూటీ ట్విట్స్ వెన‌క ఉద్దేశ్యం ఏమిటో మీకు ఇప్ప‌టికే అర్ధం అయ్యింటుంది క‌దా..! ఇదంతా ఫ్రీ ప‌బ్లిసిటి ఎత్తుగ‌డ‌ని..!
First Published:  11 Sept 2015 6:34 AM IST
Next Story