జమ్మూకాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్... ఆరుగురు మృతి
జమ్మూ కాశ్మీర్ లోని కుప్వారా జిల్లా హంద్వారా సమీపంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు చనిపోయారు. ఇందులో నలుగురు ఉగ్రవాదులు, ఇద్దరు జవాన్లు ఉన్నారు. మృతి చెందిన జవాన్లు 21 రాష్ట్రీయ రైఫిల్స్ విభాగానికి చెందిన వారు. రాజధాని శ్రీనగర్‌కు వంద కిలోమీటర్ల దూరంలో ఉండే లారీబల్ గ్రామంలో ఉగ్రవాదులు దాగి ఉన్నారనే సమాచారం అందటంతో భ్రదతా దళాలు అక్కడకు వెళ్ళాయి. వీరిని గమనించిన తీవ్రవాదులు కాల్పులు జరపడంతో ఎదురుకాల్పులు జరిపారు. ఈ సంఘటనలో ఇద్దరు జవాన్లు, నలుగురు […]
BY Pragnadhar Reddy10 Sept 2015 1:13 PM GMT
Pragnadhar Reddy Updated On: 11 Sept 2015 6:03 AM GMT
జమ్మూ కాశ్మీర్ లోని కుప్వారా జిల్లా హంద్వారా సమీపంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు చనిపోయారు. ఇందులో నలుగురు ఉగ్రవాదులు, ఇద్దరు జవాన్లు ఉన్నారు. మృతి చెందిన జవాన్లు 21 రాష్ట్రీయ రైఫిల్స్ విభాగానికి చెందిన వారు. రాజధాని శ్రీనగర్‌కు వంద కిలోమీటర్ల దూరంలో ఉండే లారీబల్ గ్రామంలో ఉగ్రవాదులు దాగి ఉన్నారనే సమాచారం అందటంతో భ్రదతా దళాలు అక్కడకు వెళ్ళాయి. వీరిని గమనించిన తీవ్రవాదులు కాల్పులు జరపడంతో ఎదురుకాల్పులు జరిపారు. ఈ సంఘటనలో ఇద్దరు జవాన్లు, నలుగురు ఉగ్రవాదులు చనిపోయారు. ఘటనా స్థలంలో ఇంకా కూంబింగ్ కొనసాగుతోంది.
Next Story