Telugu Global
Others

Wonder World 22

ఫేస్‌బుక్‌ కొత్తటూల్‌.. గ్రాఫ్‌సెర్చ్‌   వందకోట్ల మంది నెటిజన్లను అనునిత్యం అనుసంధానిస్తున్న ఫేస్‌బుక్‌ సరికొత్త సంచలనానికి తెరతీసింది. ‘గ్రాఫ్‌ సెర్చ్‌’ పేరుతో ఓ కొత్త టూల్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. దీని సాయంతో వ్యక్తులను, ఫొటోలను, స్థలాలను, అభిరుచులను సులు వుగా కనుక్కోవచ్చు. గ్రాఫ్‌ సెర్చ్‌ టూల్‌ ఫేస్‌బుక్‌కు మూడో మూల స్తంభం వంటిది. న్యూస్‌ ఫీడ్‌, టైమ్‌లైన్‌ తరహా లోనే గ్రాఫ్‌ సెర్చ్‌ కూడా ఫేస్‌బుక్‌కు కీలకం కాబోతున్నది. ప్రస్తుతం ఇది బేటామోడ్‌లోనే ఉంది. త్వరలోనే పూర్తి […]

Wonder World 22
X

ఫేస్‌బుక్‌ కొత్తటూల్‌.. గ్రాఫ్‌సెర్చ్‌

FB1

వందకోట్ల మంది నెటిజన్లను అనునిత్యం అనుసంధానిస్తున్న ఫేస్‌బుక్‌ సరికొత్త సంచలనానికి తెరతీసింది. ‘గ్రాఫ్‌ సెర్చ్‌’ పేరుతో ఓ కొత్త టూల్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. దీని సాయంతో వ్యక్తులను, ఫొటోలను, స్థలాలను, అభిరుచులను సులు వుగా కనుక్కోవచ్చు. గ్రాఫ్‌ సెర్చ్‌ టూల్‌ ఫేస్‌బుక్‌కు మూడో మూల స్తంభం వంటిది. న్యూస్‌ ఫీడ్‌, టైమ్‌లైన్‌ తరహా లోనే గ్రాఫ్‌ సెర్చ్‌ కూడా ఫేస్‌బుక్‌కు కీలకం కాబోతున్నది. ప్రస్తుతం ఇది బేటామోడ్‌లోనే ఉంది. త్వరలోనే పూర్తి స్థాయి వర్షన్‌ అందుబాటులోకి రానున్నది. గ్రాఫ్‌సెర్చ్‌ మొబైల్‌ వర్షన్‌కు మరికొంత కాలం పడుతుంది.

గ్రాఫ్‌సెర్చ్‌ టూల్‌ పూర్తిస్థాయిలో ప్రారంభమైన తర్వాత ఫేస్‌బుక్‌ పేజీలో పైన నీలి రంగులో పెద్ద సెర్చ్‌బార్‌ కనిపిస్తుంది. సెర్చ్‌ చేసే యూజర్లకు రిజల్ట్‌ను మాత్రమే కాక సెర్చ్‌ లేదా షేర్‌ చేసి కంటెంట్‌ అంతా ప్రత్యేక పేజీలో విడిగా దర్శనమిచ్చేలా ఏర్పాటు చేశారు. ఈ పేజీకి ప్రత్యేకంగా మనకు నచ్చిన టైటిల్‌ను పెట్టుకోవచ్చు. రెగ్యులర్‌ వెబ్‌ సెర్చ్‌ ఇంజన్లు లానే ఇది కూడా పనిచేస్తుంది. ఫేస్‌బుక్‌ ఖాతాదారుల కంటెంట్‌ అంతా ఈ గ్రాఫ్‌సెర్చ్‌కు అందుబాటులో ఉంటుంది. మనం అడిగే ప్రశ్నలకు తగిన ఫలితాలను, వెబ్‌ లింక్‌లను క్షణాల్లో వెతికి తెస్తుంది. మన ఫ్రెండ్స్‌ షేర్‌ చేసిన కంటెంట్‌లో మన ప్రశ్నలకు తగిన వాటిని చూపెడుతుంది. ప్రస్తుతం ఫొటోలు, వ్యక్తులు, స్థలాలు, అభిరుచులను గ్రాఫ్‌ సెర్చ్‌కు అనుసంధానించారు. ఒకే రకమైన అభిరుచులు ఉన్న వారి గురించి సెర్చ్‌ చేస్తున్నామనుకోండి.. ఉదాహరణకు టీవీ షోలకు సంబంధించిన అభిరుచి గురించి సెర్చ్‌ చేస్తే ఆ అభిరుచి ఉన్నవారందరూ పేజ్‌లో ప్రత్యక్షమవుతారు. అలాగే మీరు ప్రతిసారీ ఏదైనా రెస్టారెంట్‌ గురించో లేదా మాల్‌ గురించో సెర్చ్‌ చేస్తున్నారనుకోండి.. మీ ఇష్టాలిలా ఉన్నాయంటూ గ్రాఫ్‌సెర్చ్‌ మీ గురించి మీ స్నేహితులకు వివరిస్తుంది. ఎక్కువసార్లు ఫలానా స్థలం గురించి, ఫలానా ఫొటొల గురించి మీరు వెతుకుతున్నారంటూ మీ స్నేహితులకు సమాచారమిస్తుంది.

అయితే మీ ప్రైవసీ సెట్టింగ్స్‌ జోలికి మాత్రం గ్రాఫ్‌ సెర్చ్‌ వెళ్లదు. మీరు మీ ఫ్రెండ్స్‌తోనూ, ఫ్రెండ్స్‌ ఫ్రెండ్స్‌తోనూ, పబ్లిక్‌తోనూ షేర్‌ చేసుకునే ఓపెన్‌ కంటెంట్‌ను మాత్రమే తన సెర్చ్‌ పరిధిలో ఉంచుతుంది.

First Published:  9 Sept 2015 6:34 PM IST
Next Story