Telugu Global
Others

కారెక్కి‌ ఊపిరాడక చిన్నారుల దుర్మరణం

ఆడుకుంటూ పక్కనే ఉన్న కారెక్కిన ఇద్దరు చిన్నారులు ఊపిరాడక అందులోనే మరణించారు. నాలుగు, రెండేళ్ల వయసున్న చిన్నారులు ఇద్ద‌రు ఆడుకుంటూ పక్కనే ఉన్న కారులోకి ఎక్కి డోరు మూసుకున్నారు. ఆ స‌మ‌యంలో కారులో ఎవ‌రు లేక‌పోవ‌డం… కారు డోర్లు ఆటో లాక్‌ అయిపోయాయి. దీంతో ఊపిరాడక చిన్నా‌రులిద్ద‌రు ప్రాణాలు వదిలారు. ఈ హృదయ విదారక ఘటన ఢిల్లీ సమీపంలోని గుర్గావ్‌లో జరిగింది. చాలాసేపు వారు కారులోనే ఉండిపోవడం, ఎవరూ వీరిని చూడకపోవడంతో… ఆక్సిజన్ అందక కారులోనే వారి […]

ఆడుకుంటూ పక్కనే ఉన్న కారెక్కిన ఇద్దరు చిన్నారులు ఊపిరాడక అందులోనే మరణించారు. నాలుగు, రెండేళ్ల వయసున్న చిన్నారులు ఇద్ద‌రు ఆడుకుంటూ పక్కనే ఉన్న కారులోకి ఎక్కి డోరు మూసుకున్నారు. ఆ స‌మ‌యంలో కారులో ఎవ‌రు లేక‌పోవ‌డం… కారు డోర్లు ఆటో లాక్‌ అయిపోయాయి. దీంతో ఊపిరాడక చిన్నా‌రులిద్ద‌రు ప్రాణాలు వదిలారు. ఈ హృదయ విదారక ఘటన ఢిల్లీ సమీపంలోని గుర్గావ్‌లో జరిగింది. చాలాసేపు వారు కారులోనే ఉండిపోవడం, ఎవరూ వీరిని చూడకపోవడంతో… ఆక్సిజన్ అందక కారులోనే వారి ప్రాణాలు పోయాయని పోలీసులు తెలిపారు. వీరిద్దరూ ఒకే కుటుంబానికి చెందిన వారా? లేక వేర్వేరు కుటుంబాలకు చెందిన పిల్లలా? అన్న విషయం తెలియరాలేదు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు వివరించారు.
First Published:  9 Sept 2015 6:52 PM IST
Next Story