రాజస్థాన్ నీళ్లలో విషం కలిపే ఆలోచనలో పాక్?
నిత్యం భారతదేశంపై యుధ్దానికి సంసిద్ధత వ్యక్తం చేస్తున్న పాకిస్తాన్ ఈసారి ఓ దుర్మార్గపు ఆలోచనకు తెర తీయబోతోందన్న వార్తలు భయాందోళనలకు గురి చేస్తోంది. రాజస్థాన్ సమీపంలోని గ్రామాలకు నీరు అందించే వనరుల్లో పాకిస్థాన్ విషం కలిపే అవకాశాలు ఉన్నట్టు మిలటరీ నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. దీంతో జైసల్మేర్, బాద్మర్ జిల్లా అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తున్నారు. పాకిస్తాన్ ఈ దారుణానికి ఒడిగట్టే అవకాశాలు లేకపోలేదని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ఈ రెండు జిల్లాల్లోని నీటి సంఘాలు సైన్యంతోపాటు […]
BY sarvi10 Sept 2015 5:32 AM IST
X
sarvi Updated On: 10 Sept 2015 5:32 AM IST
నిత్యం భారతదేశంపై యుధ్దానికి సంసిద్ధత వ్యక్తం చేస్తున్న పాకిస్తాన్ ఈసారి ఓ దుర్మార్గపు ఆలోచనకు తెర తీయబోతోందన్న వార్తలు భయాందోళనలకు గురి చేస్తోంది. రాజస్థాన్ సమీపంలోని గ్రామాలకు నీరు అందించే వనరుల్లో పాకిస్థాన్ విషం కలిపే అవకాశాలు ఉన్నట్టు మిలటరీ నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. దీంతో జైసల్మేర్, బాద్మర్ జిల్లా అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తున్నారు. పాకిస్తాన్ ఈ దారుణానికి ఒడిగట్టే అవకాశాలు లేకపోలేదని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ఈ రెండు జిల్లాల్లోని నీటి సంఘాలు సైన్యంతోపాటు స్థానిక గ్రామాలకు నీటి సరఫరా చేస్తాయి. పాక్ చర్యలను అడ్డుకునేందుకు సైనికులు పహారా కాస్తున్నారని నీటి సరఫరా విభాగం తెలిపింది. ప్రజలను కూడా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. మరో 24 గంటల్లో బీఎస్ఎఫ్ జవాన్లు, పాకిస్తాన్ రేంజర్ల సమావేశాలు జరగనున్న తరుణంలో ఈ వార్తలకు ప్రాధాన్యం ఏర్పడింది.
Next Story