ఆర్‌బీఐపై నీతి ఆయోగ్ అసంతృప్తి?
రిజర్వ్ బ్యాంక్ ఇండియాపై నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ అరవింద్ పనగారియా అసంతృప్తి వ్యక్తం చేశారు. వడ్డీ రేట్లు తగ్గించడానికి అవకాశమున్నప్పటికీ అలా జరగడం లేదని, దీనివల్ల అభివృద్ధి కుంటుపడుతుందని ఆయన ఆరోపించారు. భారత్‌లో కనీసం అర శాతం నుంచి ఒక శాతం వరకూ వడ్డీ రేట్లు తగ్గించాల్సి ఉందదని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్, సీనియర్ ఎకనామిక్ అడ్వయిజర్ అరవింద్ పనగారియా అభిప్రాయపడ్డారు. వడ్డీ రేట్లు తగ్గించే వీలున్నప్పటికీ, ఆర్‌బీఐ ఉదాసీనంగా వ్యవహరిస్తోందని ఆయన ఆక్షేపించారు. […]
BY sarvi10 Sept 2015 11:03 AM IST
X
sarvi Updated On: 10 Sept 2015 11:04 AM IST
రిజర్వ్ బ్యాంక్ ఇండియాపై నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ అరవింద్ పనగారియా అసంతృప్తి వ్యక్తం చేశారు. వడ్డీ రేట్లు తగ్గించడానికి అవకాశమున్నప్పటికీ అలా జరగడం లేదని, దీనివల్ల అభివృద్ధి కుంటుపడుతుందని ఆయన ఆరోపించారు. భారత్‌లో కనీసం అర శాతం నుంచి ఒక శాతం వరకూ వడ్డీ రేట్లు తగ్గించాల్సి ఉందదని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్, సీనియర్ ఎకనామిక్ అడ్వయిజర్ అరవింద్ పనగారియా అభిప్రాయపడ్డారు. వడ్డీ రేట్లు తగ్గించే వీలున్నప్పటికీ, ఆర్‌బీఐ ఉదాసీనంగా వ్యవహరిస్తోందని ఆయన ఆక్షేపించారు. ఆర్థిక వృద్ధి కొనసాగాలంటే, పరపతి విధానం సరళీకృతం కావాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు. త్వరలో ఆర్బీఐ పరపతి సమీక్ష జరగనున్న నేపథ్యంలో పనగారియా ఈ తరహా వ్యాఖ్యలు చేయడం గమనార్హం. పనగారియా కూడా ఆర్థికవేత్త కావడంతో ఇంతకుముందు జరిగిన విధాన సమీక్షలో వడ్డీ రేట్లను సవరించని ఆర్‌బీఐ, ఈ దఫా ఆ దిశగా అడుగులు వేస్తుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ద్రవ్యోల్బణం తగ్గుతుండటం పరపతి సమీక్షలో శుభ నిర్ణయాలకు సహకరిస్తుందని తెలుస్తోంది. చైనా భయాలను ఇన్వెస్టర్ల నుంచి దూరం చేయాలంటే వడ్డీ రేట్లను తగ్గించాలని బుధవారం మోడీతో సమావేశమైన పారిశ్రామికవేత్తలు సైతం డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పనగారియా వ్యాఖ్యలు పారిశ్రామికవేత్తల వాదనకు బలం చేకూర్చినట్టుగా భావించవచ్చు.
Next Story