వినాయక చవితికి నందమూరి బొనాంజా
మెగాస్టార్ షష్టిపూర్తి, పవన్ పుట్టినరోజు సందర్భంగా మెగా కాంపౌండ్ హీరోలంతా తెగ హంగామా చేశారు. తమ సినిమాలకు సంబంధించిన టీజర్లు, ట్రయిలర్లు విడుదల చేసి హల్ చల్ చేశారు. ఇప్పుడు నందమూరి హీరోల వంతు. మరికొన్ని రోజుల్లో రాబోతున్న వినాయక చవితికి స్పెషల్ బహుమతులు సిద్ధం చేస్తున్నారు నందమూరి హీరోలు. తమ సినిమాలకు సంబంధించిన టీజర్లు, ఫస్టు లుక్కులు విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు. నందమూరి నటసింహం బాలకృష్ణ ఇప్పటికే ఈ విషయంపై క్లారిటీ ఇచ్చాడు. వినాయక […]
BY admin10 Sept 2015 12:38 AM IST
X
admin Updated On: 10 Sept 2015 7:01 AM IST
మెగాస్టార్ షష్టిపూర్తి, పవన్ పుట్టినరోజు సందర్భంగా మెగా కాంపౌండ్ హీరోలంతా తెగ హంగామా చేశారు. తమ సినిమాలకు సంబంధించిన టీజర్లు, ట్రయిలర్లు విడుదల చేసి హల్ చల్ చేశారు. ఇప్పుడు నందమూరి హీరోల వంతు. మరికొన్ని రోజుల్లో రాబోతున్న వినాయక చవితికి స్పెషల్ బహుమతులు సిద్ధం చేస్తున్నారు నందమూరి హీరోలు. తమ సినిమాలకు సంబంధించిన టీజర్లు, ఫస్టు లుక్కులు విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు. నందమూరి నటసింహం బాలకృష్ణ ఇప్పటికే ఈ విషయంపై క్లారిటీ ఇచ్చాడు. వినాయక చవితి సందర్భంగా తన డిక్టేటర్ సినిమాలోని గం..గం..గణపతి సాంగ్ టీజర్ ను విడుదల చేస్తానని ఎనౌన్స్ చేశాడు. ఇప్పుడు బాబాయ్ బాటలోనే అబ్బాయ్ తారక్ కూడా ఉన్నాడు. చవితి సందర్భంగా సుకుమార్ తో చేస్తున్న సినిమాకు సంబంధించిన టీజర్ లేదా టైటిల్ ను విడుదల చేసే ఆలోచనలో ఉన్నాడు యంగ్ టైగర్. కుదిరితే సినిమా టైటిల్ ను అధికారికంగా ప్రకటించడంతో పాటు చిన్న టీజర్ ను కూడా విడుదల చేయాలని భావిస్తున్నారు. మరోవైపు కల్యాణ్ రామ్ కూడా తన కొత్త సినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నాడు.
Next Story