రైతుల పట్ల ప్రభుత్వ పాషాణ హృదయం: నాగం
రైతుల ఆత్మహత్యలతో తెలంగాణాలో భయానక పరిస్థితి ఉందని మాజీ మంత్రి నాగం జనార్ధన్‌రెడ్డి అన్నారు. మంత్రులు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, తెలంగాణ మంత్రులకు రైతుల ఉసురు తగులుతుందన్నారు. ప్రభుత్వానికి రైతులంటే ఎందుకంత నిర్లక్ష్యమని ఆయన ప్రశ్నించారు. రైతుల పట్ల దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారన్నారు. కేసీఆర్ పాషాణ హృదయం కరగడం లేదన్నారు. రైతులు నిరాశ నిస్పృహలో ఉంటే సీఎం విదేశీ పర్యటనలు చేస్తారా అని ప్రశ్నించారు. అసెంబ్లీని సమావేశపర్చేలా అన్ని పార్టీల నేతలు గవర్నరును కోరాలని నాగం విజ్ఞప్తి చేశారు.
BY sarvi9 Sept 2015 6:37 PM IST
sarvi Updated On: 10 Sept 2015 8:24 AM IST

Next Story