జర నవ్వండి ప్లీజ్ 201
అరిస్తే “మర్యాదగా, అరవకుండా డబ్బులిచ్చేయ్…” బెదిరించాడు దొంగ. “అరిస్తే?” బెదురుగా అడిగాడు నరేష్. “నాకేం కాదు, నువ్వే పోలీసులకు మామూళ్ళు ఇచ్చుకోలేక చస్తావ్.” —————————————————————— కల “ఒరేయ్! మేకప్‌మ్యాన్‌గా వుండడం చలా కష్టంరా బాబూ. ఒక్కరోజూ కంటినిండా నిద్రపోయింది లేదు. రోజూ పీడకలలే” బాధగా అన్నాడు కొత్తగా సినిమా ఫీల్డ్‌లో జాయిన్ అయిన రాజు. “అదేంట్రా! అందమైన హీరోయిన్లు కలలోకి రావాలి గాని, నువ్వేంటి పీడకలలంటున్నావ్” ఆశ్చర్యంగా అడిగాడు శ్రీను. “వచ్చేది హీరోయిన్లే గానీ. అందరూ మేకప్ […]
అరిస్తే
“మర్యాదగా, అరవకుండా డబ్బులిచ్చేయ్…” బెదిరించాడు దొంగ.
“అరిస్తే?” బెదురుగా అడిగాడు నరేష్.
“నాకేం కాదు, నువ్వే పోలీసులకు మామూళ్ళు ఇచ్చుకోలేక చస్తావ్.”
——————————————————————
కల
“ఒరేయ్! మేకప్‌మ్యాన్‌గా వుండడం చలా కష్టంరా బాబూ. ఒక్కరోజూ కంటినిండా నిద్రపోయింది లేదు. రోజూ పీడకలలే” బాధగా అన్నాడు కొత్తగా సినిమా ఫీల్డ్‌లో జాయిన్ అయిన రాజు.
“అదేంట్రా! అందమైన హీరోయిన్లు కలలోకి రావాలి గాని, నువ్వేంటి పీడకలలంటున్నావ్” ఆశ్చర్యంగా అడిగాడు శ్రీను.
“వచ్చేది హీరోయిన్లే గానీ. అందరూ మేకప్ లేకుండానే వస్తున్నార్రా” అసలువిషయం చెప్పాడు రాజు.
——————————————————————
ఫెయిల్
టీచర్: “టెన్త్ ఫెయిల్ అయ్యావ్ కదా! ఇప్పుడేం చేస్తావ్?”
స్టూడెంట్: “ఇంకేం చేస్తాను సార్? ఈ స్కూల్‌లోనే టీచర్‌గా జాయిన్ అయిపోతాను.”