అమ్మ"లక్ష"కోట్లు లక్ష్యం చేరింది
తమిళనాడులో అంతా అమ్మ దయ. అమ్మ పలికితే..అంబ పలికినట్టే. అంతా వన్ ఉమెన్ షో. ఇక్కడ అభివృద్ధి, సంక్షేమం అంతా అమ్మ భిక్ష. పారిశ్రామికాభివృద్ధిలో పరుగులు పెడుతున్న తమిళనాడుకు పురచ్చితలైవి ప్రకటన మరింత ఉత్సాహాన్నిచ్చింది. పెట్టుబడులను ఆకర్షణే లక్ష్యంగా ప్రణాళికాబద్ధంగా పనిచేయడంలో లక్ష కోట్ల లక్ష్యం సునాయాసంగా దాటేశామని సీఎం జయలలిత ప్రకటించింది. గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్ మొదటి సమావేశాన్ని సీఎం జయలలిత ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తమిళనాడు ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి ప్రాధాన్యం […]
తమిళనాడులో అంతా అమ్మ దయ. అమ్మ పలికితే..అంబ పలికినట్టే. అంతా వన్ ఉమెన్ షో. ఇక్కడ అభివృద్ధి, సంక్షేమం అంతా అమ్మ భిక్ష. పారిశ్రామికాభివృద్ధిలో పరుగులు పెడుతున్న తమిళనాడుకు పురచ్చితలైవి ప్రకటన మరింత ఉత్సాహాన్నిచ్చింది. పెట్టుబడులను ఆకర్షణే లక్ష్యంగా ప్రణాళికాబద్ధంగా పనిచేయడంలో లక్ష కోట్ల లక్ష్యం సునాయాసంగా దాటేశామని సీఎం జయలలిత ప్రకటించింది. గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్ మొదటి సమావేశాన్ని సీఎం జయలలిత ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తమిళనాడు ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తూనే, వాణిజ్య, పారిశ్రామికరంగాలకు స్నేహపూర్వకమైన మద్దతు ఇస్తోందన్నారు. తమిళనాడు విజన్-2023 కోసం 250 బిలియన్ డాలర్లతో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రణాళిక సిద్ధం చేశామని జయ ప్రకటించారు. తమిళనాడును నాలెడ్జ్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. దేశంలోనే అతి ఎక్కువ పరిశ్రమలున్న రాష్ర్టంగా, అతి ఎక్కువమందికి ఉపాధి కల్పిస్తున్న రాష్ర్టంగా తమిళనాడును నిలిపామని జయ పేర్కొన్నారు.