కేసీఆర్‌కు నిజంగా అదే భయమా?
పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా చైనా పర్యటనకు వెళ్లిన కేసీఆర్‌కు పదవీగండం ఉందనీ, తెలంగాణ సీఎం తనపై తిరుగుబాటు జరుతుందని భయపడుతున్నారనీ, అందుకే ..ప్రత్యేక విమానంలో కీలక వ్యక్తులను తీసుకెళ్లారనీ మొదలైన అనుమానాలకు ఊతమిచ్చేలా సంచలన వ్యాఖ్యలు చేశారు పొన్నం ప్రభాకర్. “తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావుకు అల్లుడి రూపంలో పదవీ గండం పొంచి ఉంది“ అని పొన్నం ప్రభాకర్ చెబుతున్నారు. చైనా పర్యటన నుంచి తిరిగొచ్చేసరికి అల్లుడో, కొడుకో, కూతురో తిరుగుబాటు చేసి ప్రభుత్వాన్ని కూలగొడతారనే భయం కేసీఆర్‌ను […]
పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా చైనా పర్యటనకు వెళ్లిన కేసీఆర్‌కు పదవీగండం ఉందనీ, తెలంగాణ సీఎం తనపై తిరుగుబాటు జరుతుందని భయపడుతున్నారనీ, అందుకే ..ప్రత్యేక విమానంలో కీలక వ్యక్తులను తీసుకెళ్లారనీ మొదలైన అనుమానాలకు ఊతమిచ్చేలా సంచలన వ్యాఖ్యలు చేశారు పొన్నం ప్రభాకర్. “తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావుకు అల్లుడి రూపంలో పదవీ గండం పొంచి ఉంది“ అని పొన్నం ప్రభాకర్ చెబుతున్నారు. చైనా పర్యటన నుంచి తిరిగొచ్చేసరికి అల్లుడో, కొడుకో, కూతురో తిరుగుబాటు చేసి ప్రభుత్వాన్ని కూలగొడతారనే భయం కేసీఆర్‌ను వెన్నాడుతోందని మీడియా సమావేశంలో ప్రకటించారు పొన్నం. కేసీఆర్‌కు తిరుగుబాటు భయంలేకపోతే..పెట్టుబడులు ఆకర్షించే పర్యటనకు..స్పీకర్, మండలి చైర్మన్, చీఫ్ విప్ లను ఎందుకు తీసుకెళ్తారని పొన్నం ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ ఊహాగానమో, కోరికో తెలియదుగానీ.. పొన్నం చెప్పేదాంట్లో ఒక నిజం మాత్రం ఉంది. ఎమ్మెల్యేలు గ్రూపుగా ఏర్పడి అసమ్మతి ప్రకటించినా..అవిశ్వాసం తెచ్చినా.. ప్రతిపక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని కూలదోయాలనుకునే సందర్బాలలో కీలకంగా వ్యవహరించే వారు స్పీకర్, మండలి చైర్మన్, చీఫ్‌విప్ లు. అయితే కేసీఆర్ ఈ టీమ్ ను అంతా తనతోపాటు ప్రత్యేక విమానంలో చైనా తీసుకెళ్లారు. తెలంగాణ రాష్ర్టం నుంచి ఓ పదిరోజుల పాటు విదేశీ పర్యటనకు వెళ్తే..ఇన్ని జాగ్రత్తలు తీసుకోవడం మాత్రం ఒక్క గులాబీ దళపతికే చెల్లిందని కాంగ్రెస్ నేతలు అంటున్నారు.