జమ్మూ కాశ్మీర్‌లో గోమాంసం విక్రయాలపై నిషేధం
మహారాష్ట్ర, హర్యానా తరువాత జమ్మూ కాశ్మీర్‌లో గోమాంసం అమ్మకాలపై నిషేధం విధిస్తూ ఆ రాష్ట్ర హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తమ తీర్పును పకడ్బందీగా అమలు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ఇందుకు హామీ పూర్వకమైన వివరణ కూడా కోర్టుకు సమర్పించాలని సూచించింది. తమ రాష్ట్రంలో గోమాంసం నిషేధించాలని, గో మాంస వినియోగాన్ని నిలువరించాలని కోరుతూ కొందరు వ్యక్తులు కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలోనే కోర్టు పైవిధంగా తీర్పు వెలువరించింది.
BY Pragnadhar Reddy9 Sept 2015 6:51 PM IST
Pragnadhar Reddy Updated On: 10 Sept 2015 11:05 AM IST

Next Story