బైక్‌పై ఇద్దరికీ హెల్మెట్ తప్పనిసరి
బైక్ నడిపే వారితో పాటుగా వెనుక కూర్చున్న వారు కూడా హెల్మెట్ ధరించాల్సిందేనని రవాణా శాఖ డిప్యూటి కమిషనర్ రమేశ్ అన్నారు. హెల్మెట్ ధరించకపోతే ప్రమాదం జరిగినప్పుడు బైక్‌పైనున్న వారిలో ఎవరికైనా తలకు గాయాలై, ప్రాణాలు కోల్పోయే ప్రమాదముందన్నారు. దీనిపై అవగాహన కల్పించేందుకు రవాణా శాఖ అధికారులు మెదక్ జిల్లా సిద్దిపేటలో హెల్మెట్లు ధరించి బైక్ ర్యాలీ నిర్వహించారు. ఇకపై బైక్‌పై ప్రయాణించేవారిలో ఏ ఒక్కరు హెల్మెట్ ధరించకపోయినా రూ.వెయ్యి చొప్పున జరిమానా విధిస్తామని హెచ్చరించారు.
BY sarvi9 Sept 2015 6:54 PM IST
sarvi Updated On: 10 Sept 2015 11:13 AM IST

Next Story