హైదరాబాద్‌లో భారీ వర్షం... ట్రాఫిక్ కష్టాలు
హైదరాబాద్ నగరంలో గురువారం కూడా పలు చోట్ల భారీగా వర్షం కురిసింది. నగరం నలు దిక్కులా వర్షం కురవడంతో ఓవైపు ఆనందం వ్యక్తమవుతుండగా మరోవైపు వాహనదారులు ఆందోళనకు గురవుతున్నారు. భూగర్భ జలాలు పెరుగుతాయని, తాగునీటి సమస్య కొంతవరకు తీరుతుందని నగర వాసులు భావిస్తుండగా, నగర రోడ్లపై సంచారం నరక ప్రాయంగా మారుతుందని వాహనదారుల బెంబేలెత్తిపోతున్నారు. అసలే మెట్రో రైల్ నిర్మాణాలతో గంటల తరబడి ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతుండగా, ఇపుడు కురుస్తున్న వర్షాలకు ట్రాఫిక్ కష్టాలు మరింత పెరుగుతాయని […]
BY sarvi10 Sept 2015 11:08 AM IST
X
sarvi Updated On: 10 Sept 2015 11:08 AM IST
హైదరాబాద్ నగరంలో గురువారం కూడా పలు చోట్ల భారీగా వర్షం కురిసింది. నగరం నలు దిక్కులా వర్షం కురవడంతో ఓవైపు ఆనందం వ్యక్తమవుతుండగా మరోవైపు వాహనదారులు ఆందోళనకు గురవుతున్నారు. భూగర్భ జలాలు పెరుగుతాయని, తాగునీటి సమస్య కొంతవరకు తీరుతుందని నగర వాసులు భావిస్తుండగా, నగర రోడ్లపై సంచారం నరక ప్రాయంగా మారుతుందని వాహనదారుల బెంబేలెత్తిపోతున్నారు. అసలే మెట్రో రైల్ నిర్మాణాలతో గంటల తరబడి ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతుండగా, ఇపుడు కురుస్తున్న వర్షాలకు ట్రాఫిక్ కష్టాలు మరింత పెరుగుతాయని వాహన చోదకులు ఆందోళనకు గురవుతున్నారు. గురువారం మధ్యాహ్నం నుంచి నగరంలోని చాలా ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షమే కురుస్తోంది. బంజారాహిల్స్, జూబ్లిహిల్స్, కొండాపూర్, ఖైరతాబాద్, పంజాగుట్ల, లక్డీకాపూల్, ముషీరాబాద్, అంబర్‌పేట, కాచిగూడ, క్రాస్‌రోడ్, మెహదీపట్నం, అసిఫ్‌నగర్, మాసబ్‌ట్యాంక్, కోఠి, హిమయత్‌నగర్, నారాయణగూడలలో దాదాపు రెండు గంటలపాటు వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాల్లోని జనావాసాల్లో భారీగా నీరు నిలిచిపోయింది. అక్కడ నివశిస్తున్న జనం నానా యాతనలకు గురవుతున్నారు. అసలే రాజధాని ప్రాంతంలో రహదారులన్నీ గతుకుల మయంగా ఉండడంతో వాహనదారులకు తీవ్ర ఇబ్బంది ఏర్పడింది. వర్షం ప్రభావంతో పలుచోట్ల ట్రాఫిక్ నిలిచిపోయి రహదారులన్నీ జామ్ అయిపోయాయి.
Next Story