Telugu Global
Others

బీహార్‌లో కాయ్‌ రాజా కాయ్‌!

అసెంబ్లీ ఎన్నికల నగారా మోగిన బీహార్‌లో బుకీల హడావుడి మొదలైంది. క్రికెట్‌ అయినా, సినిమా అయినా, ఎన్నికలయినా… బుకీల హస్తం లేకుండా ముందుకెళ్ళడం కలలో మాట. నిన్నమొన్నటి వరకు బీజేపీ, జేడీయూ కూటమికి చెరో 110 స్థానాలు వస్తాయని అంచనా వేసి పందాలు వేస్తున్న బుకీల మనోగతం సడన్‌గా మారిపోయింది. ఇపుడు సీన్‌ మారిపోయిందని, బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయేకు 135 స్థానాలు జేడీయూ కూటమికి 40 నుంచి 50 స్థానాలు వస్తాయని, కాంగ్రెస్‌ సింగిల్‌ డిజిట్‌ దాటని […]

బీహార్‌లో కాయ్‌ రాజా కాయ్‌!
X
అసెంబ్లీ ఎన్నికల నగారా మోగిన బీహార్‌లో బుకీల హడావుడి మొదలైంది. క్రికెట్‌ అయినా, సినిమా అయినా, ఎన్నికలయినా… బుకీల హస్తం లేకుండా ముందుకెళ్ళడం కలలో మాట. నిన్నమొన్నటి వరకు బీజేపీ, జేడీయూ కూటమికి చెరో 110 స్థానాలు వస్తాయని అంచనా వేసి పందాలు వేస్తున్న బుకీల మనోగతం సడన్‌గా మారిపోయింది. ఇపుడు సీన్‌ మారిపోయిందని, బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయేకు 135 స్థానాలు జేడీయూ కూటమికి 40 నుంచి 50 స్థానాలు వస్తాయని, కాంగ్రెస్‌ సింగిల్‌ డిజిట్‌ దాటని ఫలితమే పొందుతుందని బెట్టింగ్‌లు కడుతున్నారు. ఎందుకు ఇంత సడన్‌గా సీన్‌ మారిపోయిందన్న దానికి వారి వద్ద ఉన్న సమాచారం కాస్తంత నమ్మదగినదిగానే ఉంది. జేడీయూతో లాలూ కలవడాన్ని బీహార్‌ ప్రజలు జీర్ణించుకోలేక పోతున్నారన్నది వారి మనోగతం. నిజానికి జేడీయూ నేత, సీఎం అయిన నితీష్‌పై అవినీతి ఆరోపణలు లేవు. కానీ లాలుతో చేతులు కలిపి చేజేతులా విజయావకాశాలను దెబ్బ తీసుకున్నారని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. మొదటి నుంచీ బీహార్ రాజకీయాల్లో యాదవులదే డామినేషన్. ఈ డామినేషన్‌ను ఆర్థికంగా వెనకబడిన 55 బీసీ కులాలు వ్యతిరేకిస్తుంటాయి. ఇంతకాలం ఈ వర్గ ప్రజలు లాలుకు, ములాయంలకు వ్యతిరేకంగా నితీష్‌కు మద్దతిచ్చారు. ఇప్పుడు నితీషే లాలుతో చేతులు కలపడంతో 55 కులాల వారు బీజేపీ వైపు మొగ్గుచూపుతున్నారు. ఇది కమలనాథులకు కలిసి వచ్చే అంశం. ఎందుకంటే, లాలుతో దోస్తీ వల్ల నితీష్‌కు కలిసివచ్చేదాని కన్నా కోల్పోయేదే ఎక్కువని విశ్లేషకుల అంచనా. యాదవ ఓటు బ్యాంక్ కంటే 55 కులాల బీసీ ఓటర్ల సంఖ్య చాలా ఎక్కువ. ఇదే కాయ్‌ రాజా కాయ్‌ అనే బుకీల ధీమా!
First Published:  10 Sept 2015 12:48 AM GMT
Next Story