Telugu Global
Others

త్వరలో భీమవరంలో ఆక్వా వర్శిటీ: చంద్రబాబు

భీమవరంలో ఆక్వా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్‌. చంద్రబాబునాయుడు తెలిపారు. గురువారం ఆయన ద్వారకా తిరుమలలో విర్డ్‌ ఆస్పత్రిని ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ ద్వారకా తిరుమల దేవస్థానం ఆధ్వర్యంలో నర్సింగ్‌ కాలేజీ ఏర్పాటు చేస్తామని చెప్పారు.  తాము ఈ ప్రాంతంలో పరిశ్రమలు ఏర్పాటు చేయాలని భావించినా భూముల కొరత అధికంగా ఉందని అన్నారు. అయినా పరిశ్రమ ఏర్పాటును నిర్లక్ష్యం చేసే ప్రసక్తే లేదని అన్నారు. ద్వారకా తిరుమల వద్ద 17 వేల […]

త్వరలో భీమవరంలో ఆక్వా వర్శిటీ: చంద్రబాబు
X
భీమవరంలో ఆక్వా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్‌. చంద్రబాబునాయుడు తెలిపారు. గురువారం ఆయన ద్వారకా తిరుమలలో విర్డ్‌ ఆస్పత్రిని ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ ద్వారకా తిరుమల దేవస్థానం ఆధ్వర్యంలో నర్సింగ్‌ కాలేజీ ఏర్పాటు చేస్తామని చెప్పారు.
తాము ఈ ప్రాంతంలో పరిశ్రమలు ఏర్పాటు చేయాలని భావించినా భూముల కొరత అధికంగా ఉందని అన్నారు. అయినా పరిశ్రమ ఏర్పాటును నిర్లక్ష్యం చేసే ప్రసక్తే లేదని అన్నారు. ద్వారకా తిరుమల వద్ద 17 వేల ఎకరాల అటవీ భూమి ఉందని, దాన్ని డీ నోటిఫై చేయించి పరిశ్రమల ఏర్పాటుకు శ్రీకారం చుడతామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. ద్వారకా తిరుమలలో నిత్య అన్నదాన పథకాన్ని ప్రవేశపెడతామని చెప్పారు.
కాపులను ఆదుకుంటాం
కాపులను వెనుకబడిన తరగతుల్లో చేర్చే విషయం మరిచిపోలేదని, వారిని ఆర్థికంగా ఆదుకుంటామని చంద్రబాబు చెప్పారు. అంతకుముందు ద్వారకా తిరుమల ఆలయంలో శ్రీవెంకటేశ్వరస్వామిని చంద్రబాబు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు, అర్చకులు చంద్రబాబుకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
First Published:  10 Sept 2015 9:22 AM IST
Next Story