Telugu Global
Cinema & Entertainment

బ‌న్నీని కాపి కొట్టిన   అక్ష‌య్ కుమార్..!

అల్లు అర్జున్ ..బాలీవుడ్ లో ఒక్క చిత్రం కూడా చేయ‌లేదు.  అక్ష‌య్ కుమార్ ఒక్క చిత్రం కూడా తెలుగులో న‌టించ‌లేదు. వీళ్ల‌ద్ద‌రు  క‌ల‌సి క‌నీసం న‌టించ‌లేదు.  మ‌రి అక్ష‌య్ కుమార్   వంటి స్టార్ హీరో.. బ‌న్నీ ని కాపి   ఏ విష‌యంలో కాపి కొట్టి వుంటార‌నుకుంటున్నారా..?   ఈ రోజుల్లో కాపిలు కొట్ట‌డానికి  క‌ష్ట‌ప‌డాల్సిన ప‌ని ఏముంది లెండి.? ఇంత‌కు అస‌లు విష‌యం ఏమిటంటే..   రేసు గుర్రం చిత్రంలో  సినిమా చూపిస్తా మామ సాంగ్  ఏ రేంజ్ లో […]

బ‌న్నీని కాపి కొట్టిన   అక్ష‌య్ కుమార్..!
X

అల్లు అర్జున్ ..బాలీవుడ్ లో ఒక్క చిత్రం కూడా చేయ‌లేదు. అక్ష‌య్ కుమార్ ఒక్క చిత్రం కూడా తెలుగులో న‌టించ‌లేదు. వీళ్ల‌ద్ద‌రు క‌ల‌సి క‌నీసం న‌టించ‌లేదు. మ‌రి అక్ష‌య్ కుమార్ వంటి స్టార్ హీరో.. బ‌న్నీ ని కాపి ఏ విష‌యంలో కాపి కొట్టి వుంటార‌నుకుంటున్నారా..? ఈ రోజుల్లో కాపిలు కొట్ట‌డానికి క‌ష్ట‌ప‌డాల్సిన ప‌ని ఏముంది లెండి.?

ఇంత‌కు అస‌లు విష‌యం ఏమిటంటే.. రేసు గుర్రం చిత్రంలో సినిమా చూపిస్తా మామ సాంగ్ ఏ రేంజ్ లో స‌క్సెస్ అయ్యిందో తెల‌సిందే. డైరెక్ట‌ర్ సురెంద‌రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఈ చిత్రం ఘ‌న విజ‌యం సాధించింది. అలాగే ప‌ర్టీక్యూల‌ర్ గా సినిమా చూపిస్తా మామ అనే సాంగ్ ఆడియ‌న్స్ ను ఉర్రూత‌లూగించింది. ప్ర‌స్తుతం అక్ష‌య్ కుమార్ తో మ‌న ద‌క్షిణాది డైరెక్ట‌ర్ ప్ర‌భుదేవ సింగ్ ఈజ్ బ్లింగ్ అనే చిత్రం డైరెక్ట్ చేస్తున్నాడు. ఆ చిత్రంలో సినిమా చూపిస్తామామ అనే అర్దం వ‌చ్చెలా ఒక సాంగ్ ను కొరియో గ్ర‌ఫి చేశార‌ట‌. బి టౌన్ ఆడియ‌న్స్ ను దృష్టిలో పెట్టుకుని..ఈ సాంగ్ పిక్చ‌రైజేష‌న్ ను చేశార‌ట‌. ఈ చిత్రం అక్టోబ‌ర్ 2న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. అక్షయ్ కుమార్ స‌ర‌స‌న అమీ జాక్ష‌న్, లార‌ద‌త్త లు న‌టించారు. ఈ చిత్రంలో ప్ర‌భుదేవ ఒక కీ రోల్ చేస్తున్నారు. ఇది సింగ్ ఈజ్ కింగ్ సినిమాకు సీక్వెల్ కాదు. ఎనీ వే మ‌న సినిమా చూపిస్తా మామ సాంగ్ తో ఈ మ‌ధ్య ఏకంగా మ‌న ద‌గ్గ‌రే సినిమానే వ‌చ్చింది. బి టౌన్ లో ఒక స్టార్ హీరో ఈ సాంగ్ తో చిందేశాడంటే..బ‌న్నీకి ఇండైరెక్ట్ గా బి టౌన్ లో ప‌రిచ‌యం జ‌రిగిన‌ట్టే మ‌రి.

First Published:  10 Sept 2015 6:30 AM IST
Next Story