శ్రీశైలం రిజర్వాయర్‌కు జలకళ
వర్షాకాలం వెళ్ళిపోతున్న సమయంలో కురుస్తున్న భారీ వర్షాలు కర్నూలు జిల్లా శ్రీశైలం రిజర్వాయరులో నీటి మట్టం పెరుగుదలకు దోహదం చేస్తోంది. గత మూడు రోజులుగా కురుస్తున్న ఈ భారీ వర్షాలతో రిజర్వాయరుకు వరద నీటి ప్రవాహం కొనసాగుతోంది. శ్రీశైలం డ్యామ్‌లోకి 53,774 క్యూసెక్కుల నీరు చేరింది. ఔట్‌ఫ్లోను నిలిపివేయడంతో శ్రీశైలంలో ప్రస్తుత నీటిమట్టం 799.10 అడుగులుంది. శ్రీశైలం డ్యామ్ పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 28.57 టీఎంసీల నీరు నిల్వఉంది. మరో వైపు ఎగువన […]
BY sarvi9 Sept 2015 5:54 AM IST
X
sarvi Updated On: 9 Sept 2015 5:54 AM IST
వర్షాకాలం వెళ్ళిపోతున్న సమయంలో కురుస్తున్న భారీ వర్షాలు కర్నూలు జిల్లా శ్రీశైలం రిజర్వాయరులో నీటి మట్టం పెరుగుదలకు దోహదం చేస్తోంది. గత మూడు రోజులుగా కురుస్తున్న ఈ భారీ వర్షాలతో రిజర్వాయరుకు వరద నీటి ప్రవాహం కొనసాగుతోంది. శ్రీశైలం డ్యామ్‌లోకి 53,774 క్యూసెక్కుల నీరు చేరింది. ఔట్‌ఫ్లోను నిలిపివేయడంతో శ్రీశైలంలో ప్రస్తుత నీటిమట్టం 799.10 అడుగులుంది. శ్రీశైలం డ్యామ్ పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 28.57 టీఎంసీల నీరు నిల్వఉంది. మరో వైపు ఎగువన ఉన్న తుంగభద్ర డ్యామ్‌కు వరద ఉధృతి స్వల్పంగా తగ్గింది. తుంగభద్ర నీటిమట్టం 1625.21 అడుగులుండగా ఇన్‌ఫ్లో 5,420 క్యూసెక్కులు. భారీవర్షాలతో ప్రాజెక్టుల్లోకి వరదనీరు చేరుతుండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Next Story