కృష్ణా జిల్లాకు చేరిన గోదావరి జలాలు
కృష్ణాజిల్లా నూజివీడు మండలంలోని పల్లెర్లమూడి గ్రామంలో గోదావరి జలాలను స్వాగతిస్తూ మంత్రి దేవినేని ఉమ పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ మాగంటి బాబు, ఎమ్మెల్యే వల్లభనేని వంశీలతోపాటు పెద్దఎత్తున రైతులు పాల్గొన్నారు. భాజా భజంత్రీలు, మేళతాళాలతో గోదావరి జలాలకు స్వాగతం పలికారు. వేలాది మంది రైతులు హర్షధ్వానాలు చేస్తూ కరతాళ ధ్వనులు చేశారు. బాణసంచా కాలుస్తూ, పూలు చల్లుతూ గోదావరి జలాల్లోకి దిగి ఆనందం వ్యక్తం చేశారు. పట్టిసీమ వద్ద పూర్తి స్థాయిలో లిప్టులు పని […]
BY sarvi8 Sept 2015 6:37 PM IST
X
sarvi Updated On: 9 Sept 2015 11:06 AM IST
కృష్ణాజిల్లా నూజివీడు మండలంలోని పల్లెర్లమూడి గ్రామంలో గోదావరి జలాలను స్వాగతిస్తూ మంత్రి దేవినేని ఉమ పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ మాగంటి బాబు, ఎమ్మెల్యే వల్లభనేని వంశీలతోపాటు పెద్దఎత్తున రైతులు పాల్గొన్నారు. భాజా భజంత్రీలు, మేళతాళాలతో గోదావరి జలాలకు స్వాగతం పలికారు. వేలాది మంది రైతులు హర్షధ్వానాలు చేస్తూ కరతాళ ధ్వనులు చేశారు. బాణసంచా కాలుస్తూ, పూలు చల్లుతూ గోదావరి జలాల్లోకి దిగి ఆనందం వ్యక్తం చేశారు. పట్టిసీమ వద్ద పూర్తి స్థాయిలో లిప్టులు పని చేసే రాయలసీమకు కూడా నీరు చేరేలా ఏర్పాట్లు చేస్తామని నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు.
Next Story