తరతరాలుగా సీమకు అన్యాయమేనా: బైరెడ్డి
రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాజధాని నిర్మాణం, విశాఖ అభివృద్ధి, భూ సమీకరణలపైనే దృష్టి పెట్టి రాయలసీమను పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు. రాయలసీమలోని నాలుగు జిల్లాలు కూడా ఎంతో వెనుకబడి ఉన్నాయని, ఆ విషయం తెలిసిన పెద్దమనుషులు కూడా పట్టించుకోకుండా కబుర్లతో కాలక్షేపం చేస్తున్నారని బైరెడ్డి ఆరోపించారు. బుధవారం ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి జలసాధన దీక్ష చేపట్టారు. తుంగభద్ర జలాల్లో అన్యాయం, కృష్ణా జలాల్లో అన్యాయం… హంద్రీనీవాలో అన్యాయం… ఇలా అన్ని రకాలుగా […]
BY sarvi9 Sept 2015 8:55 AM IST
X
sarvi Updated On: 9 Sept 2015 9:00 AM IST
రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాజధాని నిర్మాణం, విశాఖ అభివృద్ధి, భూ సమీకరణలపైనే దృష్టి పెట్టి రాయలసీమను పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు. రాయలసీమలోని నాలుగు జిల్లాలు కూడా ఎంతో వెనుకబడి ఉన్నాయని, ఆ విషయం తెలిసిన పెద్దమనుషులు కూడా పట్టించుకోకుండా కబుర్లతో కాలక్షేపం చేస్తున్నారని బైరెడ్డి ఆరోపించారు. బుధవారం ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి జలసాధన దీక్ష చేపట్టారు. తుంగభద్ర జలాల్లో అన్యాయం, కృష్ణా జలాల్లో అన్యాయం… హంద్రీనీవాలో అన్యాయం… ఇలా అన్ని రకాలుగా రాయలసీమ అన్యాయానికి గురవుతుందని ఆయన ఆరోపించారు. పరిశ్రమలు లేక ఉపాధి కోసం వేరే ప్రాంతాలకు వలస పోయే పరిస్థితి ఉందని, వర్షాలు లేక రైతులు కన్నీటితో కాలక్షేపం చేస్తున్నారని… ఇంకెంత కాలం రాయలసీమ వాసులకు ఈ దీనావస్థ అని ఆయన ప్రశ్నించారు. నీటి కేటాయింపుల్లో రాయలసీమ జిల్లాలకు అన్యాయాన్ని వ్యతిరేకిస్తూ జలసాధన దీక్షను బైరెడ్డి చేస్తున్నారు. పట్టిసీమ ప్రాజెక్టు వల్ల రాయలసీమకు ప్రయోజనం లేదని రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుని రాయలసీమకు జరుగుతున్న అన్యాయాన్ని అడ్డుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. రాయలసీమ జిల్లాలను ప్రధాని దత్తత తీసుకోవాలని కోరారు. పరిశ్రమల్లో స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలన్నారు. పెద్దోళ్ళంతా హైదరాబాద్‌లోనో, గుంటూరులోనో ఉంటున్నారని, దత్తత తీసుకునే వాళ్ళు కూడా ఆయా ప్రాంతాలపైనే దృష్టి పెడుతున్నారని, ఇంకెంత కాలం ఇలా వెనుకబాటు తనానికి గురవుతు ఉండాలని బైరెడ్డి ప్రశ్నించారు.
Next Story