Telugu Global
Others

Wonder World 20

హాంకాంగ్‌లో కరెంట్‌ బస్సు! హాంకాంగ్‌లో మొట్టమొదటి కరెంట్‌ బస్సు సర్వీసు ఈ మధ్యనే ప్రారంభమయ్యింది. సీఎల్‌పీ పవర్‌ హాంకాంగ్‌ లిమిటెడ్‌ కంపెనీ తయారు చేసిన ఈ బస్సును ‘ఈ – కోచ్‌’గా వ్యవహరిస్తున్నారు. అంటే ఇది పర్యావరణానికి హాని కలిగించని, కాలుష్యరహితమైన బస్సు అన్నమాట. ఈ బస్సు వల్ల పర్యావరణానికి మేలు జరగడమే కాదు ఇంధనం కూడా ఆదా అవుతుంది. ఇది పూర్తిగా కరెంట్‌తోనే నడుస్తుంది. ఈ బస్సులో 49 మంది ప్రయాణించే వీలుంది. సాధారణ డీజిల్‌ ఇంజన్ల […]

Wonder World 20
X

హాంకాంగ్‌లో కరెంట్‌ బస్సు!

electric Buss

హాంకాంగ్‌లో మొట్టమొదటి కరెంట్‌ బస్సు సర్వీసు ఈ మధ్యనే ప్రారంభమయ్యింది. సీఎల్‌పీ పవర్‌ హాంకాంగ్‌ లిమిటెడ్‌ కంపెనీ తయారు చేసిన ఈ బస్సును ‘ఈ – కోచ్‌’గా వ్యవహరిస్తున్నారు. అంటే ఇది పర్యావరణానికి హాని కలిగించని, కాలుష్యరహితమైన బస్సు అన్నమాట. ఈ బస్సు వల్ల పర్యావరణానికి మేలు జరగడమే కాదు ఇంధనం కూడా ఆదా అవుతుంది. ఇది పూర్తిగా కరెంట్‌తోనే నడుస్తుంది. ఈ బస్సులో 49 మంది ప్రయాణించే వీలుంది. సాధారణ డీజిల్‌ ఇంజన్ల కంటే ఈ బస్సు నుంచి తక్కువ శబ్దం వెలువడుతుంది. డీజిల్ల్‌ ఇంజన్ల కన్నా చాలా తక్కువ వేడిని ఉత్పత్తి చేస్తుంది. డీజిల్‌ ధరతో పోలిస్తే ఈ కరెంటు బస్సుకు అయ్యే ఖర్చు కూడా చాలా తక్కువ. దాదాపు 27శాతం ఖర్చు ఆదా అవుతుంది. మెయింటెనెన్స్‌ చాలా సులువు. ఎందుకంటే అసలు ఈ బస్సులో గేర్‌బాక్సు గానీ, ఇంజను గానీ ఏవీ ఉండవట. బస్సుకు మూడుగంటల సేపు పూర్తిస్థాయిలో ఛార్జింగ్‌ చేస్తే 250 నుంచి 300 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ఏసీ కూడా పనిచేస్తుంది.

First Published:  7 Sept 2015 6:34 PM IST
Next Story