Telugu Global
Others

పట్టిసీమ నుంచి కృష్ణానదికి నీరు విడుదల

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్టిసీమ ప్రాజెక్టు నుంచి కృష్ణానదిలోకి నీరు విడుదల చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా తాటిపూడి లిఫ్ట్‌ నుంచి పోలవరం కాల్వలోకి నీటిని విడుదల చేయగా పెదవేగి మండలం గానంపేట దగ్గర ప్రభుత్వ విప్‌ చింతమనేని ప్రభాకర్‌ పూజలు చేసి పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆయన అక్కడ ఒక తాత్కాలిక వంతెనను ప్రారంభించారు. రోజుకు 600 క్యూసెక్కుల గోదావరి నీరు కృష్ణానదిలో కలవనుంది. తొలుత ఈ నీరు రేపు కృష్ణాజిల్లాకు […]

పట్టిసీమ నుంచి కృష్ణానదికి నీరు విడుదల
X
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్టిసీమ ప్రాజెక్టు నుంచి కృష్ణానదిలోకి నీరు విడుదల చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా తాటిపూడి లిఫ్ట్‌ నుంచి పోలవరం కాల్వలోకి నీటిని విడుదల చేయగా పెదవేగి మండలం గానంపేట దగ్గర ప్రభుత్వ విప్‌ చింతమనేని ప్రభాకర్‌ పూజలు చేసి పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆయన అక్కడ ఒక తాత్కాలిక వంతెనను ప్రారంభించారు. రోజుకు 600 క్యూసెక్కుల గోదావరి నీరు కృష్ణానదిలో కలవనుంది. తొలుత ఈ నీరు రేపు కృష్ణాజిల్లాకు చేరుతుంది. నిజానికి ఇది ట్రయల్‌ రన్‌గా చెప్పవచ్చు. ఇందులో భాగంగానే కాలువల పరిశీలనకు తాడిపూడి నుంచి గోదావరి జలాలను విడుదల చేసినట్టు అధికారులు చెబుతున్నారు. మరో వారం రోజుల్లో పట్టిసీమ పనులు పూర్తవుతాయని, అప్పటి నుంచి నీరు అందుబాటులో ఉన్నంతవరకు నిరంతరం గోదావరి జలాలు కృష్ణానదిలోకి తరలిస్తామని వారు తెలిపారు.
First Published:  8 Sept 2015 7:48 AM IST
Next Story