Telugu Global
Others

మరో యేడాది కాంగ్రెస్‌ అధినేత్రి సోనియానే

మరో యేడాదిపాటు సోనియాగాంధీయే పార్టీకి నాయకత్వం వహించాలని కాంగ్రెస్‌ వర్కింగ్ కమిటీ తీర్మానించింది. సంస్థాగత ఎన్నికలు యేడాదిపాటు వాయిదా వేయాలని, అప్పటి వరకు సోనియానే అధ్యక్ష పదవిలో కొనసాగాలని నిర్ణయించింది. మంగళవారం భేటీ అయిన ఈ కమిటీ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇప్పటివరకు ఐదేళ్ళపాటు కాల పరిమితి ఉన్న అధ్యక్ష పదవిని మూడేళ్ళకు తగ్గించాలని కూడా సమావేశం నిర్ణయించింది. ద్వంద్వ సభ్యత్వ పునరుద్దరణకు ప్రతిపాదించింది. బీహార్‌ ఎన్నికల తర్వాత ఏఐసీసీ సమావేశం నిర్వహించాలని, ఈ సమావేశం […]

మరో యేడాది కాంగ్రెస్‌ అధినేత్రి సోనియానే
X
మరో యేడాదిపాటు సోనియాగాంధీయే పార్టీకి నాయకత్వం వహించాలని కాంగ్రెస్‌ వర్కింగ్ కమిటీ తీర్మానించింది. సంస్థాగత ఎన్నికలు యేడాదిపాటు వాయిదా వేయాలని, అప్పటి వరకు సోనియానే అధ్యక్ష పదవిలో కొనసాగాలని నిర్ణయించింది. మంగళవారం భేటీ అయిన ఈ కమిటీ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇప్పటివరకు ఐదేళ్ళపాటు కాల పరిమితి ఉన్న అధ్యక్ష పదవిని మూడేళ్ళకు తగ్గించాలని కూడా సమావేశం నిర్ణయించింది. ద్వంద్వ సభ్యత్వ పునరుద్దరణకు ప్రతిపాదించింది. బీహార్‌ ఎన్నికల తర్వాత ఏఐసీసీ సమావేశం నిర్వహించాలని, ఈ సమావేశం అనంతరమే పార్టీ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టాలని కూడా సీడబ్య్లూసీ తీర్మానించింది. 50 శాతం పార్టీ పదవుల్ని ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలకు కట్టబెట్టాలని కూడా కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయించింది.
యూపీఏ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన కొన్ని పథకాలను ఎన్డీయే నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తోందని, ఇందులో ముఖ్యంగా ఆర్టీఐ, ఉపాధి హామీ పధకాలు ఉన్నాయని, పార్టీ ఏ మాత్రం అప్రమత్తంగా లేకపోయినా ఇలాంటి కీలక పథకాలు ప్రజలకు అందకుండా పోతాయని సీడబ్ల్యూసీ అభిప్రాయపడింది. భూ సేకరణ బిల్లుపై కేంద్ర వెనక్కి తగ్గడం కాంగ్రెస్‌ పార్టీ సాధించిన ఘన విజయంగా భావించాలని సోనియాగాంధీ అన్నారు.ఈ సమావేశంలో అధ్యక్షోపన్యాసం చేసిన సోనియాగాంధీ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాహుల్ మార్గదర్శకంలో చేపట్టిన ఆందోళనలతో భూ సేకరణ బిల్లుపై కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది. కేంద్ర ప్రజావ్యతిరేక విధానంపై రాహుల్ కొనసాగించిన ఆందోళన ప్రశంసనీయం. లాండ్ ఆర్డినెన్స్ విషయంలో ప్రభుత్వం మెడలు వంచిన ఘనత ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్తకు దక్కుతుంది. ఎన్డీఏ ప్రభుత్వం చరిత్రను వక్రీకరించి నెహ్రును చెడ్డవ్యక్తిగా చూపేందుకు ప్రయత్నం చేస్తోంది. భూ ఆర్డినెన్స్‌పై విజయానికి గుర్తుగా ఈ నెల 20న ర్యాలీ నిర్వహించనున్నట్లు ఆమె పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని ఆర్‌ఎస్‌ఎస్‌ నియంత్రిస్తోందని, ఈ సంస్థ ఎజెండా ఏమిటో అందరికీ విదితమేనని సీడబ్ల్యూసీ పేర్కొంది. దీన్ని సమర్ధంగా ఎదుర్కోక పోతే వైషమ్యాలు తలెత్తుతాయని సోనియా అభిప్రాయపడ్డారు.
First Published:  8 Sept 2015 9:11 AM IST
Next Story