రాజధానిలో మెట్రో వచ్చే వరకూ మెమూ రైళ్లు
విజయవాడ మెట్రో రైలుకు కేంద్రం విముఖత వ్యక్తం చేసిన నేపథ్యంలో ప్రత్యమ్నాయాలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. కొన్నేళ్ళపాటు ఉద్యోగులు, ప్రజల రవాణాకు అనుకూలంగా ఉండే విధంగా ప్రణాళిక రూపకల్పన చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి నుంచి గుంటూరుకు కొన్నేళ్లు మెమూ రైళ్లను నడిపేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు రెండు రోజుల కిందట ఈ విషయాన్ని ప్రకటించారు. అమరావతి – గుంటూరు మెమూ రైళ్లను నడిపేందుకు […]
BY sarvi8 Sept 2015 6:43 AM IST
X
sarvi Updated On: 8 Sept 2015 7:25 AM IST
విజయవాడ మెట్రో రైలుకు కేంద్రం విముఖత వ్యక్తం చేసిన నేపథ్యంలో ప్రత్యమ్నాయాలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. కొన్నేళ్ళపాటు ఉద్యోగులు, ప్రజల రవాణాకు అనుకూలంగా ఉండే విధంగా ప్రణాళిక రూపకల్పన చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి నుంచి గుంటూరుకు కొన్నేళ్లు మెమూ రైళ్లను నడిపేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు రెండు రోజుల కిందట ఈ విషయాన్ని ప్రకటించారు. అమరావతి – గుంటూరు మెమూ రైళ్లను నడిపేందుకు అధ్యయనం చేయాల్సిందిగా కేంద్రం రైల్వే శాఖను ఆదేశించింది. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఈ విషయంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని చర్చలు జరుపుతున్నారు. రాజధానిలో జనసాంద్రత పెరిగేంత వరకు మెమూ రైళ్లను నడపడమే ఉత్తమమని కేంద్రం భావిస్తోంది. ఇంచుమించు 16 కోచ్‌లతో మెమూ రైలుని నడపవచ్చు. ఒక్కో కోచ్‌లో 70 మంది కూర్చునేందుకు వీలుంటుంది. దీంతో ఏకకాలంలో 1100 మందికి పైగా గమ్యస్థానాలకు చేరవేయవచ్చు. మెమూ రైళ్లను నడపాలంటే నంబూరు నుంచి అమరావతికి డబ్లింగ్ రైలుమార్గాన్ని నిర్మించాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం 50 శాతం నిధులు సమకూరిస్తే నూతన రైలుమార్గాన్ని కొన్ని నెలల్లోనే నిర్మిస్తామని ఇటీవల గుంటూరు పర్యటనకు వచ్చిన సందర్భంలో దక్షిణ మధ్య రైల్వే జీఎం ప్రదీప్‌కుమార్ శ్రీవాస్తవ ప్రకటించారు. ఇందుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్ళాల్సి ఉంది.
Next Story