కొండారెడ్డిపల్లిని దత్తత తీసుకున్న ప్రకాశ్‌రాజ్
నటుడు ప్రకాశ్‌రాజ్ మహబూబ్‌నగర్ జిల్లాలోని కేశంపేట మండలం కొండారెడ్డిపల్లి గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ప్రకాశ్‌రాజ్ సచివాలయంలో పంచాయతీరాజ్ శాఖమంత్రి కేటీఆర్‌ను కలిసి ఈ విషయాన్ని తెలిపారు. ప్రకాశ్‌రాజ్ ఫౌండేషన్ ద్వారా కొండారెడ్డిపల్లిలో మార్పులు తెచ్చేందుకు కృషి చేస్తానన్నారు. కర్ణాటకలోనూ తన ఫౌండేషన్ ద్వారా పలు కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు. కొండారెడ్డిపల్లిలో తనకు భూమి ఉందని, శాస్ర్తీయ పద్ధతులతో ఇక్కడ వ్యవసాయం చేస్తున్నట్లు వివరించారు. తన సిబ్బంది ఇప్పటికే గ్రామ స్థితిగతులపై ఆధ్యయనం చేస్తున్నారని, ఆ సర్వే […]
BY sarvi8 Sept 2015 6:15 AM IST
X
sarvi Updated On: 8 Sept 2015 6:15 AM IST
నటుడు ప్రకాశ్‌రాజ్ మహబూబ్‌నగర్ జిల్లాలోని కేశంపేట మండలం కొండారెడ్డిపల్లి గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ప్రకాశ్‌రాజ్ సచివాలయంలో పంచాయతీరాజ్ శాఖమంత్రి కేటీఆర్‌ను కలిసి ఈ విషయాన్ని తెలిపారు. ప్రకాశ్‌రాజ్ ఫౌండేషన్ ద్వారా కొండారెడ్డిపల్లిలో మార్పులు తెచ్చేందుకు కృషి చేస్తానన్నారు. కర్ణాటకలోనూ తన ఫౌండేషన్ ద్వారా పలు కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు. కొండారెడ్డిపల్లిలో తనకు భూమి ఉందని, శాస్ర్తీయ పద్ధతులతో ఇక్కడ వ్యవసాయం చేస్తున్నట్లు వివరించారు. తన సిబ్బంది ఇప్పటికే గ్రామ స్థితిగతులపై ఆధ్యయనం చేస్తున్నారని, ఆ సర్వే ముగియగానే… గ్రామంలో తాను చేపట్టే పనులను వెల్లడిస్తానని తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన గ్రామ జ్యోతి, హరితహారం, మిషన్ కాకతీయ కార్యక్రమాలు అద్భుతమని ప్రకాశ్‌రాజ్ ఈ సందర్భంగా కొనియాడారు. గ్రామాన్ని దత్తత తీసుకునేందుకు ముదుకొచ్చిన ప్రకాశ్‌రాజ్‌ను మంత్రి కేటీఆర్ అభినందించారు.
Next Story