Telugu Global
Others

తెలంగాణ చెక్‌పోస్టులపై ఏసీబీ దాడులు

తెలంగాణలోని చెక్‌పోస్టులపై ఏసీబీ అధికారులు ఏకకాలంలో దాడులు చేశారు. దీంతో అవినీతికి పాల్పడుతున్న అధికారులు అడ్డంగా దొరికిపోయారు. సోమవారం అర్ధరాత్రి నుంచి తెల్లవారేవరకు ఈ దాడులు కొనసాగించారు. ఐదు జిల్లాల్లో జరిగిన ఈ దాడులు అధికారుల్లో గుబులు పుట్టించాయి. నల్గొండ జిల్లా రామాపురం చెక్‌ పోస్టుపై, మెదక్‌ జిల్లా జహీరాబాద్‌ చెక్‌పోస్టుపై, ఖమ్మం జిల్లా అశ్వారావుపేట చెక్‌పోస్టుపై, ఆదిలాబాద్‌ జిల్లా వాంకిడి చెక్‌పోస్టుపై, నిజామాబాద్‌ జిల్లా మద్నూర్‌ చెక్‌పోస్టుపై దాడులు జరిగాయి. లెక్క తేలని నగదును మూడు […]

తెలంగాణ చెక్‌పోస్టులపై ఏసీబీ దాడులు
X
తెలంగాణలోని చెక్‌పోస్టులపై ఏసీబీ అధికారులు ఏకకాలంలో దాడులు చేశారు. దీంతో అవినీతికి పాల్పడుతున్న అధికారులు అడ్డంగా దొరికిపోయారు. సోమవారం అర్ధరాత్రి నుంచి తెల్లవారేవరకు ఈ దాడులు కొనసాగించారు. ఐదు జిల్లాల్లో జరిగిన ఈ దాడులు అధికారుల్లో గుబులు పుట్టించాయి. నల్గొండ జిల్లా రామాపురం చెక్‌ పోస్టుపై, మెదక్‌ జిల్లా జహీరాబాద్‌ చెక్‌పోస్టుపై, ఖమ్మం జిల్లా అశ్వారావుపేట చెక్‌పోస్టుపై, ఆదిలాబాద్‌ జిల్లా వాంకిడి చెక్‌పోస్టుపై, నిజామాబాద్‌ జిల్లా మద్నూర్‌ చెక్‌పోస్టుపై దాడులు జరిగాయి. లెక్క తేలని నగదును మూడు చెక్‌పోస్టుల నుంచి స్వాధీనం చేసుకున్నారు. జహీరాబాద్‌లో రూ. 50 వేలు, వాంకిడిలో 58 వేలు, జోరజ్‌లో 44,500, మద్నూర్‌లో 44 వేల రూపాయలను లెక్క తేలకపోవడంతో స్వాధీనం చేసుకున్నారు. ఈ మొత్తాల లెక్కలు చెప్పమని అధికారులను అడగగా వారు నీళ్ళు నమలడంతో కేసులు నమోదు చేశారు. ఒక్కాసారిగా అధికారులు దాడులు చేయడంతో ఆయా చెక్‌పోస్టుల్లో అనధికారికంగా పని చేస్తూ అధికారుల తరఫున వసూళ్ళు జరుపుతున్న ప్రయివేటు ఉద్యోగులు పారిపోయారు. అక్కడే ఉన్న డ్రైవర్లు, క్లీనర్లు, వాహనాల యజమానులను ప్రశ్నిస్తే చెక్‌పోస్టుల్లోని అధికారుల అవినీతిని కళ్ళకు కట్టేట్టుగా చెప్పారు. దీంతో కేసులు నమోదు చేసి చెక్‌పోస్టు అధికారులను అరెస్ట్‌ చేశారు.
First Published:  8 Sept 2015 5:19 AM IST
Next Story