ఎలుకలు పోయినా ... కుర్చీలను వదలని అధికారం
ఎలుకలు కొరికి వారం రోజుల పసికందు చనిపోయిన సంఘటనలో అందరికీ తెలిసిన విషయం ఒకటయితే జరుగుతున్నది మాత్రం మరొకటి. ఈ సంఘటనలో పారిశుద్ధ్య లోపమే ఎలుకల సంచారానికి కారణమని నిర్ధారించి ప్రభుత్వం ఆర్‌ఎంవో, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ను విధుల నుంచి సస్పెండ్ చేసింది. జీజీహెచ్ సూపరింటెండెంట్‌ను, పీడియాట్రిక్ సర్జన్‌ను బదిలీ చేసింది. ఆ సమయంలో విధుల్లో ఉన్న హెడ్ నర్సును, స్టాఫ్ నర్సును సస్పెండ్ చేసింది. పసికందు తల్లికి రూ.5లక్షల ఎక్స్‌గ్రేషియా అందజేసింది. హమ్మయ్య… అంతా సజావుగా అనుకున్నట్టే […]
BY admin7 Sept 2015 8:43 AM IST
X
admin Updated On: 7 Sept 2015 9:04 AM IST
ఎలుకలు కొరికి వారం రోజుల పసికందు చనిపోయిన సంఘటనలో అందరికీ తెలిసిన విషయం ఒకటయితే జరుగుతున్నది మాత్రం మరొకటి. ఈ సంఘటనలో పారిశుద్ధ్య లోపమే ఎలుకల సంచారానికి కారణమని నిర్ధారించి ప్రభుత్వం ఆర్‌ఎంవో, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ను విధుల నుంచి సస్పెండ్ చేసింది. జీజీహెచ్ సూపరింటెండెంట్‌ను, పీడియాట్రిక్ సర్జన్‌ను బదిలీ చేసింది. ఆ సమయంలో విధుల్లో ఉన్న హెడ్ నర్సును, స్టాఫ్ నర్సును సస్పెండ్ చేసింది. పసికందు తల్లికి రూ.5లక్షల ఎక్స్‌గ్రేషియా అందజేసింది. హమ్మయ్య… అంతా సజావుగా అనుకున్నట్టే జరిగిందని అటు సాధారణ ప్రజలు, ఆందోళనకారులు ఉపశమనం పొంది ఊపిరి పీల్చుకుంటే… మంత్రులు, ప్రభుత్వ పెద్దలు తమ పని ముగించేసి అంతా సర్దుమణిగిపోయిందన్నట్టు వ్యవహరించారు. కాని ఇక్కడే అసలు ట్విస్టు. కానీ, ఘటన జరిగి 2వారాలు అవుతున్నా.. ఎవరి సీట్లలో వారే ఉన్నారు. బదిలీ చేశామన్నవారు ఈనాటికీ ఆస్పత్రిని వదిలిపెట్టలేదు. సస్పెండ్ అయ్యారన్నవారూ విధుల్లోనే ఉన్నారు. ఇది చిన్నారుల తల్లిదండ్రులపై బాగా ప్రభావం చూపుతున్నట్టు కనిపిస్తోంది. రోజూ వందమంది పిల్లలు చేరే ఈ వార్డులో మూడు రోజులుగా ఒక్కరంటే ఒక్కరూ… చేరలేదు. సిబ్బంది ఇళ్లకు వెళుతూ ఖాళీ వార్డులకు తాళాలు వేసి వెళ్లిపోవాల్సిన పరిస్థితి. ఎందుకిలా? ఒకనాడు ఈ వార్డును డాక్టర్ నాయుడమ్మ వార్డు అనేవారు. ఇప్పుడేమో ఎలుకల వార్డు అంటున్నారు! ఇదీ తేడా!
Next Story