రాజీవ్‌గాంధీని సోనియా పడేసింది!
ఇటలీలో ఓ సాధారణ కుటుంబం నుంచి సోనియా… భారతదేశంలో కాశ్మీరీ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన రాజీవ్‌గాంధీ… వీరిద్దరూ ఎలా తారసపడ్డారో తెలిస్తే ఇప్పటివారికి ఆశ్చర్యం కలగక మానదు. ఓ చిన్న ఉద్యోగం చేసుకునే సోనియా ఓసారి రాజీవ్ అందాన్ని చూసి చలించిపోయిందట! వెంటనే ఆయన దగ్గరకు వెళ్ళి ‘యు ఆర్ సో బ్యూటీఫుల్’ అని చెప్పేసిందట! ఆశ్చర్య పోయిన రాజీవ్‌గాంధీ ఆ తర్వాత తేరుకుని ఆమె వంక తేరపార చూశాడట. ఇంగ్లాండ్ వేదికగా అలా మొదలైన వారి […]
BY sarvi7 Sept 2015 10:54 AM IST
X
sarvi Updated On: 7 Sept 2015 10:54 AM IST
ఇటలీలో ఓ సాధారణ కుటుంబం నుంచి సోనియా… భారతదేశంలో కాశ్మీరీ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన రాజీవ్‌గాంధీ… వీరిద్దరూ ఎలా తారసపడ్డారో తెలిస్తే ఇప్పటివారికి ఆశ్చర్యం కలగక మానదు. ఓ చిన్న ఉద్యోగం చేసుకునే సోనియా ఓసారి రాజీవ్ అందాన్ని చూసి చలించిపోయిందట! వెంటనే ఆయన దగ్గరకు వెళ్ళి ‘యు ఆర్ సో బ్యూటీఫుల్’ అని చెప్పేసిందట! ఆశ్చర్య పోయిన రాజీవ్‌గాంధీ ఆ తర్వాత తేరుకుని ఆమె వంక తేరపార చూశాడట. ఇంగ్లాండ్ వేదికగా అలా మొదలైన వారి స్నేహం ప్రేమగా మారి వివాహం దాకా వచ్చింది. నాటి ప్రధాని, రాజీవ్ మాతృమూర్తి అయిన ఇందిరాగాంధీ ఆమోదించడంతో పెళ్ళి చేసుకుని ఒక్కటయ్యారు. క్రమంగా అతి పెద్ద ప్రజాస్వామ్య దేశానికి మకుటం లేని మహారాణి అయ్యారు. ఆయన అందాన్ని చూసి పడిపోయానని స్వయంగా సోనియాగాంధీ తన స్నేహతురాలితో పంచుకోగా ఆమె ఈ విషయాన్ని గ్రంధస్థం చేసింది. ఆ విషయం ఇపుడు బయటకు వచ్చింది. ఇటాలియన్-ఇండియన్ల ప్రేమకథాచిత్రం అదన్నమాట!
Next Story