Telugu Global
Others

ఊపిరి పోసిన వానలు... ఊపిరి తీసిన పిడుగులు

ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ ఆదివారం భారీ వర్షాలు ఎండ తీవ్రతతో అల్లాడుతున్న జనాలను వర్షం సేద తీర్చింది. ఎండిపోతున్న ఖరీఫ్‌ పంటలకు ఊపిరిపోసింది. తెలుగు రాష్ట్రాల్లోని వివిధ జిల్లాల్లో పిడుగుపాటుకు 21 మంది మృతి చెందగా, గోడకూలి మరొకరు మరణించారు. తెలంగాణలోనూ హైదరాబాద్‌ సహా పలు జిల్లాల్లో వర్షాలు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో గాలివాన ధాటికి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. పత్తి, మొక్కజొన్న పంటలు పాడయ్యాయి. అరటి, చెరకు తోటలు నేలకొరిగాయి. మెదక్‌, నల్లగొండ […]

ఊపిరి పోసిన వానలు... ఊపిరి తీసిన పిడుగులు
X
ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ ఆదివారం భారీ వర్షాలు ఎండ తీవ్రతతో అల్లాడుతున్న జనాలను వర్షం సేద తీర్చింది. ఎండిపోతున్న ఖరీఫ్‌ పంటలకు ఊపిరిపోసింది. తెలుగు రాష్ట్రాల్లోని వివిధ జిల్లాల్లో పిడుగుపాటుకు 21 మంది మృతి చెందగా, గోడకూలి మరొకరు మరణించారు. తెలంగాణలోనూ హైదరాబాద్‌ సహా పలు జిల్లాల్లో వర్షాలు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో గాలివాన ధాటికి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. పత్తి, మొక్కజొన్న పంటలు పాడయ్యాయి. అరటి, చెరకు తోటలు నేలకొరిగాయి. మెదక్‌, నల్లగొండ జిల్లాల్లోనూ మోస్తరు వర్షం కురిసింది. హైదరాబాద్‌లో ఆది, సోమవారాల్లో కుండపోత వర్షం కురిసింది. పలుచోట్ల పెద్దఎత్తున ట్రాఫిక్‌ నిలిచిపోయి వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ఏపీలో తూర్పుగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో పిడుగుపాటుకు 21 మంది మృతి చెందారు. అనంతపురానికి చెందిన ఓ మహిళ కర్ణాటకలో పిడుగుపాటుకు గురై మరణించింది. నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఆరుగురు చొప్పున మృతి చెందారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ముగ్గురు చొప్పున మృతి చెందగా, తూర్పుగోదావరిలో ఇద్దరు మృతి చెందారు. చిత్తూరు జిల్లాలో ఒకరు మరణించారు. కాగా నెల్లూరులో నిర్మాణంలో ఉన్న అపార్ట్‌మెంట్‌ గోడ కూలి పక్కనే ఉన్న షెడ్‌పై పడటంతో ఓ వ్యక్తి మృతి చెందారు.
First Published:  7 Sept 2015 3:37 PM IST
Next Story