Telugu Global
Others

దేనికైనా రెడీ: పాక్ ఆర్మీ చీఫ్

అంతర్గతంగా లేదా సరిహద్దు నుంచైనా.. చిన్నదైనా.. పెద్దదైనా.. ఎలాంటి యుద్ధాన్నైనా సరే ధీటుగా ఎదుర్కొనే సత్తా పాక్‌ సైన్యానికి ఉందని ఆ దేశ సైనాధ్యక్షుడు జనరల్ రహేల్ షరీఫ్ అన్నారు. పొరుగు దేశంతో ఎలాంటి యుద్ధాన్నైనా ఎదుర్కొనే సత్తా పాకిస్థాన్‌కు ఉందని షరీఫ్ అన్నారు. 1965లో భారత్‌తో యుద్ధం జరిగి 50 ఏళ్లు అయిన సందర్భంగా పాక్ ఆర్మీ ప్రధాన కార్యాలయంలో జరిగిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. అమర వీరులకు నివాళి అర్పిస్తూ వారి త్యాగాలు వృథా […]

దేనికైనా రెడీ: పాక్ ఆర్మీ చీఫ్
X
అంతర్గతంగా లేదా సరిహద్దు నుంచైనా.. చిన్నదైనా.. పెద్దదైనా.. ఎలాంటి యుద్ధాన్నైనా సరే ధీటుగా ఎదుర్కొనే సత్తా పాక్‌ సైన్యానికి ఉందని ఆ దేశ సైనాధ్యక్షుడు జనరల్ రహేల్ షరీఫ్ అన్నారు. పొరుగు దేశంతో ఎలాంటి యుద్ధాన్నైనా ఎదుర్కొనే సత్తా పాకిస్థాన్‌కు ఉందని షరీఫ్ అన్నారు. 1965లో భారత్‌తో యుద్ధం జరిగి 50 ఏళ్లు అయిన సందర్భంగా పాక్ ఆర్మీ ప్రధాన కార్యాలయంలో జరిగిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. అమర వీరులకు నివాళి అర్పిస్తూ వారి త్యాగాలు వృథా కావన్నారు. 50 ఏళ్లలో పాకిస్థాన్ ఎన్నో కష్టనష్టాలను చవి చూసిందని ఆర్మీ చీఫ్ జనరల్ షరీఫ్ అన్నారు. అయినప్పటికీ ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనే సత్తా పాక్ ఆర్మీకి ఉందని ధీమా వ్యక్తం చేశారు.
First Published:  7 Sept 2015 10:17 AM IST
Next Story