ఇజ్రాయెల్‌లో జన్మాష్టమి వేడుకలు!
ఇజ్రాయెల్‌లోని బర్కాయి పట్టణంలో శ్రీకృష్ణుడి జన్మదినోత్సవం జన్మాష్టమి వేడుకలు వైభవంగా జరిగాయి. వందల మంది భక్తులు.. వారిలో అత్యధికులు యూదులు హరేరామ-హరేకృష్ణ కీర్తనలతో హోరెత్తించారు. భారత్‌లో సంస్కృతి, సంప్రదాయాలు, పర్వదినాల పట్ల ఆసక్తి తగ్గుతున్నా విదేశాల్లో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితి. ఇజ్రాయెల్‌లోని వ్యవసాయ ఆధారిత పట్టణమైన కిబ్బుట్జ్ బర్కాయి.. దాని పరిసర ప్రాంత హారిష్ టౌన్‌షిప్ వాసులు ఎంతో ఆనందోత్సాహాలతో ఈ వేడుకలు నిర్వహించారు. హారిష్ పట్టణ వాసుల కుటుంబీకులను భారత్‌లో పర్యటనకు వచ్చినప్పుడు బృందావనం, […]
BY sarvi7 Sept 2015 5:32 AM IST
X
sarvi Updated On: 7 Sept 2015 5:32 AM IST
ఇజ్రాయెల్‌లోని బర్కాయి పట్టణంలో శ్రీకృష్ణుడి జన్మదినోత్సవం జన్మాష్టమి వేడుకలు వైభవంగా జరిగాయి. వందల మంది భక్తులు.. వారిలో అత్యధికులు యూదులు హరేరామ-హరేకృష్ణ కీర్తనలతో హోరెత్తించారు. భారత్‌లో సంస్కృతి, సంప్రదాయాలు, పర్వదినాల పట్ల ఆసక్తి తగ్గుతున్నా విదేశాల్లో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితి. ఇజ్రాయెల్‌లోని వ్యవసాయ ఆధారిత పట్టణమైన కిబ్బుట్జ్ బర్కాయి.. దాని పరిసర ప్రాంత హారిష్ టౌన్‌షిప్ వాసులు ఎంతో ఆనందోత్సాహాలతో ఈ వేడుకలు నిర్వహించారు. హారిష్ పట్టణ వాసుల కుటుంబీకులను భారత్‌లో పర్యటనకు వచ్చినప్పుడు బృందావనం, మాయాపూర్ తదితర ప్రాంతాల్లో కృష్ణాష్టమి వేడుకల నిర్వహణ తీరు ఆకట్టుకున్నది. భారత్ సంస్కృతి, సంప్రదాయాలు తనను బాగా ఆకర్షించాయని, స్థానికులు కూడా సహకరిస్తున్నారని కరెన్ అనే హారిష్ వాసి చెప్పారు. ఆయన జెరూసలేం నుంచి వచ్చి ఈ టౌన్‌షిప్‌లో స్థిరపడ్డాడు. 14 ఏండ్ల క్రితం ప్రారంభించిన ఈ వేడుకల్లో తాను తప్పనిసరిగా పాల్గొంటానన్నారు. ఈ సందర్భంగా చిన్ని కృష్ణుడి వేషధారణలతో కళారూపాల ప్రదర్శన, గీతాలాపన, రాత్రి పొద్దుపోయే వరకు నృత్యాలు చేశారు.
Next Story