ఎన్టీఆర్ సినిమా పేరు మారిందా..?
ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఈ సినిమా షూటింగ్ లండన్ లో నెల రోజులకు పైగా ఏకథాటిగా జరుగుతోంది. సినిమాకు నాన్నకు ప్రేమతో అనే టైటిల్ అనుకుంటున్నారు. అయితే ఈ విషయాన్ని మేకర్స్ మాత్రం అధికారికంగా ప్రకటించలేదు. కానీ మీడియాలో మాత్రం ఇదే పేరు రౌండ్స్ కొడుతోంది. మరోవైపు ఎన్టీఆర్ తో సినిమా చేస్తున్న వెంకటేశ్వర సినీచిత్ర బ్యానర్ పై మరో టైటిల్ రిజిస్టర్ అయింది. తాజాగా అభిరామ్ అనే […]
BY admin7 Sept 2015 12:40 AM IST
X
admin Updated On: 7 Sept 2015 7:13 AM IST
ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఈ సినిమా షూటింగ్ లండన్ లో నెల రోజులకు పైగా ఏకథాటిగా జరుగుతోంది. సినిమాకు నాన్నకు ప్రేమతో అనే టైటిల్ అనుకుంటున్నారు. అయితే ఈ విషయాన్ని మేకర్స్ మాత్రం అధికారికంగా ప్రకటించలేదు. కానీ మీడియాలో మాత్రం ఇదే పేరు రౌండ్స్ కొడుతోంది. మరోవైపు ఎన్టీఆర్ తో సినిమా చేస్తున్న వెంకటేశ్వర సినీచిత్ర బ్యానర్ పై మరో టైటిల్ రిజిస్టర్ అయింది. తాజాగా అభిరామ్ అనే మరో టైటిల్ ను రిజిస్టర్ చేయించారు మేకర్స్. దీంతో తారక్ సినిమాకు అభిరామ్ అనే పేరునే పెట్టొచ్చనే వార్తలొస్తున్నాయి. సినిమాలో ఎన్టీఆర్ పాత్ర పేరు అభిరామ్ కావడంతో ఈ వార్తలకు మరింత ఊతం దొరికింది. అయితే అటు నాన్నకు ప్రేమతో అనే టైటిల్ ను కానీ.. ఇటు అభిరామ్ అనే పేరును గానీ మేకర్స్ ఇంకా కన్ ఫర్మ్ చేయలేదు. ఓ మంచి రోజు చూసి టైటిల్ ను అఫీషియల్ గా ఎనౌన్స్ చేయాలనుకుంటున్నారు. దాదాపు 90శాతం షూటింగ్ ను లండన్ లోనే పూర్తిచేసి ఇండియాకు రావాలని ప్లాన్ చేస్తున్నారు. సినిమాలో ఎన్టీఆర్ కు తండ్రిగా రాజేంద్రప్రసాద్, బాస్ గా జగపతిబాబు నటిస్తున్నారు. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీత దర్శకుడు.
Next Story