హెల్మెట్‌పై 15 రోజులు చైతన్య కార్యక్రమాలు: హైకోర్టు
ద్విచక్రవాహనంతో హెల్మెట్ కొనుగోలు చేయాలన్న రవాణాశాఖ నిబంధనపై హైకోర్టులో వ్యాజ్యం దాఖలైంది. ద్విచక్రవాహనంతోపాటు హెల్మెట్ కొనుగొలు తప్పనిసరి చేయడం సరికాదని కోర్టు తెలిపింది. హెల్మెట్ వాడకం జరిగేలా చూడాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. హెల్మెట్ లేని వాహనదారులపై 92,164 కేసులు నమోదు చేశామని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు. 2014 జూన్ నుంచి ఈ కేసులు నమోదయ్యాయని వివరించారు. దీనిపై స్పందించిన కోర్టు వాహనదారుల్లో 15 రోజులపాటు చైతన్యం కల్పించాలని సూచించింది. ఆ తరువాత హెల్మెట్ వాడకాన్ని […]
BY admin6 Sept 2015 6:54 PM IST
admin Updated On: 7 Sept 2015 10:05 AM IST
ద్విచక్రవాహనంతో హెల్మెట్ కొనుగోలు చేయాలన్న రవాణాశాఖ నిబంధనపై హైకోర్టులో వ్యాజ్యం దాఖలైంది. ద్విచక్రవాహనంతోపాటు హెల్మెట్ కొనుగొలు తప్పనిసరి చేయడం సరికాదని కోర్టు తెలిపింది. హెల్మెట్ వాడకం జరిగేలా చూడాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. హెల్మెట్ లేని వాహనదారులపై 92,164 కేసులు నమోదు చేశామని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు. 2014 జూన్ నుంచి ఈ కేసులు నమోదయ్యాయని వివరించారు. దీనిపై స్పందించిన కోర్టు వాహనదారుల్లో 15 రోజులపాటు చైతన్యం కల్పించాలని సూచించింది. ఆ తరువాత హెల్మెట్ వాడకాన్ని తప్పనిసరి చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను కోర్టు రెండు వారాలపాటు వాయిదా వేసింది.
Next Story